అలా చేస్తే.. నేను బీజేపీలో చేరుతా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Jan 2020 9:24 PM IST
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీలో చేరికపై స్పష్టత ఇచ్చారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలిపితే తాను బీజేపీలో చేరతానని అన్నారు. బీజేపీ నేతలను కలవడంతో ప్రాధాన్యం లేదన్న ఆయన.. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. సత్యకుమార్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని అన్నారు.
అయితే.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిన జేసీ.. పార్టీ మారుతారంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేఫథ్యంలో జేసీ బీజేపీ నేతను కలవడం.. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ మారతారనే ఊహాగానాలకు బలమిస్తుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
Next Story