గుంటూరు జిల్లా ఎస్పీని కలిసిన జనసేన నేతలు...!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Nov 2019 12:15 PM IST
ముఖ్యాంశాలు
- వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని జనసేన నేతల విజ్ణప్తి
- ధర్మవరం ఘటన పై పూర్తి విచారణ చేస్తాం: రూరల్ ఎస్పీ విజయరావు
గుంటూరు: దుర్గి మండలం ధర్మవరంలో జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారంటూ జిల్లా ఎస్పీ విజయరావుని జనసేన నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వివాదంతో సంబంధం లేనివారిపై, అమాయకులపై కేసు పెట్టవద్దన జనసేన నేతలు కోరారు. కాగా ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేస్తామని ఎస్పీ విజయరావు తెలిపారు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కూడా సంయమనం పాటించాలి. అలాగే అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలని విజయరావు పేర్కొన్నారు. గత శనివారం రోజున ధర్మవరంలో పలువురు గ్రామంలో ఏర్పాటు చేసిన సాంఘీక నాటక, పాట ప్రదర్శన చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
Next Story