కరోనా బాధితులకు పవన్‌ కల్యాణ్‌ భారీ విరాళం

By అంజి  Published on  26 March 2020 4:21 AM GMT
కరోనా బాధితులకు పవన్‌ కల్యాణ్‌ భారీ విరాళం

హైదరాబాద్‌: జనసేన పార్టీ అధ్యక్షుడు, తెలుగు సినీ హీరో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కరోనా వైరస్‌ బాధితులకు అండగా నిలిచారు. కరోనా కట్టడి కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తన వంతు సహాయం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు పవన్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇస్తానన్నారు. అలాగే ప్రధాని రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో చాలా నిరుపేదలు పనిలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ముందుకు వస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా తమకు తోచినంతగా విరాళాలు ప్రకటిస్తున్నారు.





హీరో నితిన్‌ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు తమ రెండు నెలల జీతాన్ని కరోనా బాధితుల కోసం ప్రభుత్వానికి ఇస్తామని ప్రకటించారు.

Next Story