జన్‌ధన్ ఖాతాల్లోకి రూ. 7,500
By సుభాష్ Published on 21 April 2020 1:30 PM ISTప్రపంచమంతా కరోనా వైరస్‌తో అల్లకల్లోలం అవుతుంది. ఇక భారత్‌ను సైతం ఈ మహమ్మారి వెంటాడుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్‌డౌన్ కారణంగా సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చేసుకోవడానికి పనులు లేక తిండికోసం కష్టాలు ఎదుర్కొంటున్నారు. దీంతో కోట్లాది ప్రజలు జీవనోపాధి కోల్పోయారు. ఉపాధి లేక కష్టాలు చవిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాంటి వారికి కేంద్రం నుంచి రూ.500 చొప్పున జన్‌ధన్ ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం.
ఇలాంటి పరిస్థితుల్లో జన్‌ధన్, పెన్షన్ ఖాతాల్లోనూ, ప్రధాని కిసాన్ పథకం ద్వారా వారికి రూ.7,500 అందించాలని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో వలసదారులను, పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరోనాపై కేంద్రానికి తగిన సూచనలు చేస్తామన్నారు.
కాగా, నిన్న కరోనాపై మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వసలదారుల సమస్యలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పునరుద్దరణపై చర్చ జరిగింది. చిన్న పరిశ్రమల పునరుద్దరణకు ప్యాకేజీని రూపొందించామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. దీనిని కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో వలసదారులను, పేదలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.