జమ్మూ: భారత ఆర్మీ కాల్పుల్లో ఇప్పటి వరకూ 108 మంది ఉగ్రవాదులు హతం

By సుభాష్  Published on  26 Jun 2020 9:09 AM IST
జమ్మూ: భారత ఆర్మీ కాల్పుల్లో ఇప్పటి వరకూ 108 మంది ఉగ్రవాదులు హతం

ముఖ్యాంశాలు

  • కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న జమ్మూకశ్మీర్

  • ఉగ్రకాల్పులను తిప్పికొడుతున్న భారత ఆర్మీ

  • ఇప్పటి వరకు 108 ఉగ్రవాదులు హతం

  • ప్రతి రోజు కాల్పులకు తెగబడుతున్న ఉగ్రమూకలు

జమ్మూ కశ్మీర్‌లో తుపాకుల మోతతో భీకరమైన వాతావరణం నెలకొంటోంది. రోజురోజుకు ఉగ్రవాదులు రెచ్చిపోవడాలు పెరిగిపోతుండటంతో భారత సైన్యం అప్రమత్తమై వారి కాల్పులను తిప్పికొడుతున్నాయి. భారత్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్‌ వర్గాల సమాచారంలో బలగాలు ముందస్తుగా అప్రమత్తమవుతూ వస్తున్నాయి. ఒక వైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతుంటే మరో వైపు ఉగ్రమూకలు తెగ రెచ్చిపోతున్నారు. అయిన వారి అగడాలకు ఆర్మీ జవాన్లు తగిన గుణపాఠం చెబుతూనే ఉన్నారు.

ఇక జమ్మూకశ్మీర్‌ ప్రాంతంలో మాత్రం ప్రతి రోజు ఎదురు కాల్పులు చోటు చోటు చేుకోవడంతో కాల్పుల శబ్దాలతో దద్దరిల్లిపోతోంది. ఈ కాల్పుల్లో రోజు నలుగురు, ఐదుగురు చొప్పున ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి భారత బలగాలు. ఒక్కో రోజు మాత్రం 10 మంది చొప్పున కూడా ఉగ్రవాదునుల హతమార్చాయి భారత బలగాలు. ఇలా ఎన్నిసార్లు బుద్ది చెప్పినా ఉగ్రమూకలు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో ప్రతి రోజు జమ్మూలోని ఏదో ఒక చోటు ఎన్‌కౌంటర్‌ జరుగుతూనే ఉంది. జమ్మూలోని షోపియన్‌, పాంపూర్‌, మీజ్‌ పాంపోర్‌, బారముల్లా తదితర ప్రాంతాల్లో ప్రతి రోజు కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

ఇప్పటి వరకూ 108 మంది ఉగ్రవాదులు హతం

కాగా, తాజాగా శుక్రవారం కూడా జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ మొత్తం 108 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు భారత భద్రత బలగాలు పేర్కొన్నాయి. ఇలా ప్రతి రోజు ఉగ్రవాదులు ఆగడాలు పెరిగిపోతున్నాయి. భారత సైన్యం ఎన్నిసార్లు బుద్ది చెప్పినా.. వారి తీరు ఏ మాత్రం మారడం లేదు. బలగాలపై కాల్పులకు తెగబడుతుండటంతో వారి కాల్పులను తిప్పకొట్టి హతమారుస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలంలో పేలుడు పదార్థాలు, తుపాకులు భారీగానే స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. ప్రతి రోజు కూడా జమ్మూ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ మధ్యన ఉగ్రవాదులు తీవ్రంగా రెచ్చిపోతున్నారని, భారత్‌పై దాడులు చేసేందుకు మసీదుల్లో, ఇతర ఇళ్లల్లో నక్కి ఉండి భారత్‌లోకి చొరబడుతున్నారని, అందుకే వారి కాల్పులను తిప్పికొట్టేందుదకు ప్రత్యేక బలగాలు ఆపరేషన్‌ చేపడుతున్నాయని భారత ఆర్మీ చెబుతోంది.

Next Story