జమ్మూకశ్మీర్‌లోని పంథా చౌక్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా, ఒక పోలీసు అమరుడయ్యాడు. హతమైన ఉగ్రవాదులు పాక్‌ లష్కర్‌ తోయిబాకు చెందిన వారని భద్రతా బలగాలు తెలిపాయి. ఘటన స్థలంలో భారీగా మందుగుండు సామాగ్రి, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పంథా చౌక్‌ ప్రాంతాన్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

కాగా, నిన్న పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హతం అయ్యారు. అయితే మరి కొందరు ఉగ్రవాదులు పంథా చౌక్‌లో నక్కి ఉన్నారనే విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు వారిని మట్టబెట్టాయి. ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని గాలింపు చర్యలు చేపడుతున్నారు.

కాగా, జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదులకు అడ్డగా మారిపోయింది. భారత సైతం ఉగ్రవాదులకు ఎన్నిసార్లు బుద్ది చెప్పినా వారి తీరులో మార్పు రావడం లేదు. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు భారీగా చొరబడుతుండటంతో ప్రత్యేక భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఆపరేషన్‌ చేపడుతూనే ఉన్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *