కుప్పకూలిన రెస్టారెంట్.. 17 మంది మృతి
By సుభాష్ Published on 30 Aug 2020 11:17 AM ISTచైనాలో విషాదం చోటు చేసుకుంది. షాంగ్జి ప్రావిన్స్‌లోని లిన్సెన్ నగరంలో జియాంగ్‌ఫెన్ కౌంటీలో శనివారం ఓ రెస్టారెంట్ కూప్పలింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. రెండంతస్తులు ఉన్న రెస్టారెంట్ శిథిలాల నుంచి మొత్తం 45 మందిని బయటకు తీశారు. వీరిలో 17 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరో 30 మంది వరకు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, చైనా పీపుల్స్ పోలీస్ పారామిలటరీ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే భవనం కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read
గాయకుడు కారుణ్య ఇంట విషాదంNext Story