ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌లో సీటు దక్కించుకున్న సీఎం జగన్ కూతురు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Aug 2020 9:15 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డికి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్స్(ప్రపంచం లోని టాప్ 5 బిజినెస్ స్కూల్స్ ఒకటి)లో సీటు దక్కింది. ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్షారెడ్డి.. ప్యారిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుకోబోతోంది.
లండన్‌లో చదువు అనంతరం హర్షాకు అమెరికా బేస్డ్ ఎంఎన్‌సీలో ఫైనాన్సియల్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. అయితే.. ఆ ఉద్యోగాన్ని వదులుకొని హర్షా.. ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ చదవడానికి మొగ్గు చూపింది. దీంతో కుమార్తెను పారిస్ పంపేందుకు మంగళవారం సీఎం జగన్ బెంగుళూరుకు వెళ్లబోతున్నట్లు సమాచారం. బెంగళూరు నుంచి విమానంలో కుమార్తెను ప్యారిస్ పంపించనున్నారు.
Also Read
కేసీఆర్ కోపానికి ఏపీ సీఎం జగన్ కూల్ చెక్Next Story