Fact Check : పాకిస్థాన్ పతాకం ఉన్న కారును బెంగళూరు పోలీసులు అడ్డుకున్నారా..?
By న్యూస్మీటర్ తెలుగు
పోలీసులు ఓ వాహనాన్ని ఆపడం.. ఆ కారు మీద ఉన్న పతాకాన్ని మార్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ కారుకు తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది.
ఆ వీడియోతో పాటూ “Tamil Nadu jihadis enter Karnataka in a car with Pakistan flag. Bangalore police stopped, asked them to remove and changed the national flag. Why Tamil Nadu police not take any action against these sleeper cells of Pakistan? Who tied their hands? or lake of knowledge?” ఈ మెసేజీ కూడా వైరల్ అవుతోంది.
Tamil nadu jihadis enter Karnataka in a car with Pakistan flag. Bangalore police stopped, asked them to remove and changed National flag. Why Tamil nadu police not take any action against these Sleeper cells of Pakistan? Who tied their hands? or lake of knowledge? https://t.co/aNTL4Zp5NF
— Nandagopal.K.M. (@nandaji1958) September 11, 2020
తమిళనాడుకు చెందిన జీహాదీలు కర్ణాటక లోకి కారు ద్వారా ప్రవేశించారు. ఆ కారుకు పాకిస్థాన్ పతాకం ఉంది. దీన్ని చూసిన బెంగళూరు పోలీసులు ఆపారు. బెంగళూరు పోలీసులు పాకిస్థాన్ పతాకాన్ని తీసేసి.. భారత జాతీయ పతాకాన్ని ఉంచారు. ఇలా పాకిస్థాన్ జెండాతో తిరుగుతూ ఉన్నా తమిళనాడు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. పాకిస్థాన్ స్లీపర్ సెల్స్ మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మీ చేతులు ఎవరు కట్టేశారు..? లేక అది పాకిస్థాన్ పతాకం అని కూడా తెలియదా..? అన్నది మెసేజీలో ఉన్న సారాంశం.
ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. యూట్యూబ్ లో కూడా వీడియోను పోస్టు చేశారు. “SHOCKING: Bengaluru man drives car with Pakistan flag, caught by police” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
Kannadaprabha.com అనే న్యూస్ వెబ్ సైట్ లో కూడా తమిళనాడు నుండి కర్ణాటకకు వచ్చిన కారును బెంగళూరు పోలీసులు ఆపారని.. ఆ కారు మీద పాకిస్థాన్ పతాకం ఉండడాన్ని చూసి.. దాన్ని మార్పించి భారత పతాకాన్ని ఉంచారని అందులో చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టులో నిజం లేదు. ఇస్లామిక్ పతాకాన్ని పోలీసులు పాకిస్తాన్ పతాకంగా పొరపాటు పడ్డారు.
కారు మీద ఉన్న పతాకంకు పాకిస్థాన్ జాతీయ పతాకాన్ని ఎటువంటి సంబంధం లేదు. కారు మీద ఉన్న జెండా IUML అనే పార్టీకి చెందినది. గతంలో కూడా చాలా సార్లు, చాలా ప్రాంతాల్లో IUML పార్టీకి చెందిన పతాకాన్ని పాకిస్థాన్ కు చెందిన పార్టీగా పొరబడ్డారు.
IUML పార్టీకి చెందిన పతాకాన్ని పలు ప్రాంతాల్లో పాకిస్థానీ పతాకాలుగా భావించారు. గతంలో కూడా చాలా మీడియా సంస్థలు అవి పాకిస్థాన్ పతాకం కావని తేల్చి చెప్పాయి. రాహుల్ గాంధీ ప్రచారంలో కూడా ఈ పార్టీ పతాకం కనిపించగా.. అప్పట్లో పాకిస్థాన్ పతాకం అంటూ కథనాలను రాసుకుని వచ్చారు.
IUML పార్టీకి చెందిన పతాకానికి, పాకిస్థాన్ పతాకానికి తేడాను గమనించవచ్చు.
కాబట్టి భారత్ కు చెందిన ఇస్లామిక్ పార్టీకి చెందిన జెండాను.. పాకిస్థాన్ కు చెందిన జెండాగా పొరపాటు పడ్డారు పోలీసులు. అంతేకానీ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.