బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ముంబై నగరం మీద, శివ సేన నేతల మీద తీవ్ర స్థాయిలో మండిపడింది కంగనా..! బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా కూడా కంగనాకు సంబంధించిన ఫోటోను పలువురు తమ తమ అకౌంట్లలో పోస్టు చేస్తూ ఉన్నారు. ఆమె అండర్ వరల్డ్ డాన్ అబూ సలేంతో కలిసి ఉన్న ఫోటో ఇదని చెబుతూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.

కాంగ్రెస్ నేత నగ్మా కూడా ఈ ఫోటోను పోస్టు చేశారు.


న్యూస్ మీటర్ కు ఈ ఫోటోకు సంబంధించిన నిజా నిజాలు తెలపాలంటూ రిక్వెస్ట్ అందింది. మరాఠీలో ఆ ఫోటో కింద టెక్స్ట్ కూడా ఉంది.

K1

ఫోటోతో పాటూ వైరల్ అవుతున్న మెసేజీని అనువదించగా ‘ఈ ఫోటోలో కంగనా రనౌత్ తో కలిసి ఉన్న వ్యక్తి ప్రముఖ గ్యాంగ్ స్టర్ అబూ సలేం. ఆ సాధారణ వ్యక్తి, మహారాష్ట్రకు చెందిన వారెవరైనా కానీ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలవాలంటే ఎంతో కష్టపడాలి.. కానీ మహారాష్ట్ర మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడి.. అబూ సలేం వంటి క్రిమినల్స్ తో కాంటాక్ట్ ఉన్న వ్యక్తులకు రాజ్ భవన్ లో రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు’ అని ఉంది.

నిజ నిర్ధారణ:

కంగనాతో పాటూ ఉన్నది అబూ సలేం అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి ‘నిజం లేదు’.

కంగనాతో పాటూ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మార్క్ మాన్యుయెల్. మార్క్ సీనియర్ ఎడిటర్ గా మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నారు. టైమ్స్, మిడ్ డే, ఆఫ్టర్ నూన్ వంటి వాటికి పని చేశారు. ఆయన ప్రస్తుతం దైనిక్ భాస్కర్ గ్రూప్ తో కలిసి పని చేస్తూ ఉన్నారు. మంచి మంచి కథనాలను రాయడంలో ఆయన దిట్ట.. అలాగే పలువురు ప్రముఖులతో కలిసి ఇంటర్వ్యూలు కూడా చేశారు. అలాగే బుక్స్ కూడా రాశారు. ఫిక్షనల్ పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ ను ఆయన రాశారు. బాలీవుడ్ కూడా ఆయన రాసిన బుక్ మీద ఆసక్తిని చూపిస్తోంది.

వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా Huffington Post లో 2018లో ఓ కథనాన్ని ప్రచురించగా.. ఆ లింక్ లో కనిపించింది. కంగనా రనౌత్ పర్సనల్ విషయాలపై ఆ ఆర్టికల్ ఉంది. Kangana Ranaut Should Realise She’s Too Talented To Milk Her Personal Life For Attention.. అని ఉంది.

K2

ఆయన ఉన్న Tedx టాక్స్ కు సంబంధించిన వీడియోను కూడా గమనించవచ్చు. ఆయన పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. మదర్ థెరెసా నుండి మొహమ్మద్ అలీ వరకూ ఆయన ఇంటర్వ్యూ చేసిన వ్యక్తుల్లో ఉన్నారు. Moryaa Re! అనే క్రైమ్ థ్రిల్లర్ నవలను కూడా ఆయన రాశారు. క్రైమ్ న్యూస్ ను కవర్ చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన అంచలంచలుగా కెరీర్ లో ఎదిగారు.

India Today, Alt News సంస్థలు కూడా కంగనా రనౌత్ అబూ సలేంతో ఉంది అంటూ వచ్చిన వార్తలను ఖండించాయి.

కంగనాతో ఉన్నది అబూ సలేం అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఫోటోలో ఉన్నది సీనియర్ జర్నలిస్టు మార్క్ మాన్యుయెల్. వైరల్ అవుతున్న పోస్టులు ‘పచ్చి అబద్ధం’.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort