ఇంటర్‌పోల్ అధికారిగా ఇర్ఫాన్‌ పఠాన్‌

By Medi Samrat  Published on  30 July 2020 1:56 PM IST
ఇంటర్‌పోల్ అధికారిగా ఇర్ఫాన్‌ పఠాన్‌

విల‌క్ష‌ణ న‌టుడు చియాన్‌ విక్రమ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్ ఈ చిత్రంతో ‌నటుడిగా పరిచయం అవుతున్నాడు. విక్రమ్, ద‌ర్శ‌కుడు అజయ్‌ జ్ఞానముత్తు ‌కాంబినేష‌న్‌లో ‘కడరాం కొండాన్‌’ చిత్రం తరువాత వ‌స్తున్న రెండో చిత్రం ‘కోబ్రా’. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రంలో టీమిండియా మాజీ ఆట‌గాడు‌ ఇర్ఫాన్‌ పఠాన్.. పోషిస్తున్న తన పాత్ర విశేషాలను వెల్లడించాడు.

కొల్‌కత్తాలో జరిగిన ‘కోబ్రా’ చిత్ర షూటింగ్‌ సమయంలో తీసిన ఫొటోను ఇర్ఫాన్‌ పఠాన్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. తాను ఒక ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా చిత్రంలో నటిస్తున్నట్లు వెల్ల‌డించాడు. క్రికెటర్‌గా మాంచి పేరున్న‌ ఇర్ఫాన్‌ పఠాన్..‌ తొలిసారిగా ఈ చిత్రంలో నటిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.



ఇదిలావుంటే.. గత ఫిబ్రవరిలో ‘కోబ్రా’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల కాగా.. ఇందులో విక్రమ్‌ ఏడు పాత్రల్లో కనిపించాడు. ఈ చిత్రం 25 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇక‌ ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీత దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం నుండి ‘తుమ్లి తుల్లాల్‌....’ అనే మొదటి పాటను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. అనంతరం విక్రమ్‌ స్టైల్‌ లుక్‌తో ఉన్న ఫొటోను కూడా సోషల్‌ మీడియాలో వ‌దిలింది చిత్రయూనిట్.

Next Story