అలాంటి వ్యాఖ్య‌లు మానుకోండి.. హిందువులపై అఘాయిత్యాలు జరగకూడదు

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ యూనస్‌, ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

By Medi Samrat
Published on : 4 April 2025 3:11 PM IST

అలాంటి వ్యాఖ్య‌లు మానుకోండి.. హిందువులపై అఘాయిత్యాలు జరగకూడదు

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ యూనస్‌, ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇరువురు నేతల మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. సంభాషణ సందర్భంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇరువురు నేతల భేటీపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ సమగ్ర సమాచారం ఇచ్చారు. విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. "ప్రజాస్వామ్య, స్థిరమైన, శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్‌కు భారత్‌ యొక్క మద్దతును ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలను నెలకొల్పాలని భారత్‌ కోరుకుంటోందని మోదీ ప్రొఫెసర్ యూనస్‌తో చెప్పారు.

దేశాల మ‌ధ్య వాతావరణాన్ని పాడుచేసే వ్యాఖ్య‌లు మానుకోవాలని ప్రధాని మోదీ కోరారు. సరిహద్దు భద్రత, భద్రతను నిర్వహించడానికి సరిహద్దు చట్టాన్ని కఠినంగా అమలు చేయడం, అక్రమ సరిహద్దు క్రాసింగ్‌లను నిరోధించడం చాలా అవసరం అని సూచించారు.

బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న మైనారిటీల (హిందువుల)పై మహ్మద్ యూనస్ పాలనలో అనేక అఘాయిత్యాలకు సంబంధించిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు.

థాయ్‌లాండ్‌ను సందర్శన‌కు ముందు.. మహ్మద్ యూనస్ చైనాను సందర్శించారు. అక్కడ భారత ఈశాన్య రాష్ట్రానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. దానిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ప్రాంతంలోని సముద్రానికి ఢాకా మాత్రమే సంరక్షకుడు అని మహ్మద్ యూనస్ చైనా గడ్డపై చెప్పాడు. తన దేశంలో పెట్టుబడులు పెట్టమని చైనాను ఆహ్వానిస్తున్నప్పుడు, యూనస్ భారతదేశ పరిమితులను లెక్కించాడు.. బంగ్లాదేశ్‌లో తమకు భారీ వ్యాపార అవకాశం ఉందని చెప్పడం ద్వారా చైనాను ఆకర్షించాడు.

Next Story