మాస్క్ వ‌ద్ద‌న్న రెండేళ్ల పాప‌.. విమానం నుంచి దింపేసిన సిబ్బంది.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

Young family booted from plane after 'toddler refuses to wear mask. ఓ చిన్నారి మాస్క్ పెట్టుకోలేద‌ని విమానంలోని సిబ్బంది

By Medi Samrat  Published on  15 Dec 2020 6:53 AM GMT
మాస్క్ వ‌ద్ద‌న్న రెండేళ్ల పాప‌.. విమానం నుంచి దింపేసిన సిబ్బంది.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

ఓ చిన్నారి మాస్క్ పెట్టుకోలేద‌ని విమానంలోని సిబ్బంది ఘోరంగా ప్ర‌వ‌ర్తించారు. ఆ చిన్నారి త‌ల్లిదండ్రుల‌ను ఏకంగా విమానం నుంచి దింపేశారు. ఈ ఘ‌ట‌న న్యూజెర్సీకి చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో జ‌రిగింది. త‌మ బాధ‌ను తెలియ‌జేస్తూ.. చిన్నారి త‌ల్లి ఈ ఘ‌ట‌న‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్‌గా మారింది. కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి అయింది. విమానయాన సంస్థలు కూడా మాస్క్ తప్పనిసరి అనే నిబంధనను అమలు చేస్తున్నారు.

ఎలిజ్ అర్భన్ అనే యువతి, తన భర్త, రెండు సంవత్సరాల బిడ్డతో కలిసి నెవాక్ విమానాశ్రయంలో డెన్వర్ నుంచి న్యూజెర్సీకి బయలుదేరేందుకు యునైటెడ్ ఎయిరలైన్స్‌కి చెందిన విమానం ఎక్కింది. కాగా.. ఎలిజ్ అర్భన్ కుమారై మాస్క్ ధ‌రించ‌లేదు. ఈ విష‌యాన్ని విమాన సిబ్బంది గ‌మ‌నించారు. తనకు మాస్క్ వద్దని పాప మారాం చేసింది. పాప తండ్రి ఎంతగా బలవంతం చేసినా, ఆ బిడ్డ వినలేదు. ఇంతలో విమానం సిబ్బంది ఒకరు వచ్చి, పాపను తీసుకుని కిందకు దిగాలని సూచించాడు. తాను బిడ్డ ముఖంపై మాస్క్ ను ఉంచానని, పాప కొంత మారాం చేస్తుందని, కాసేపట్లో సర్దుకుంటుందని చెప్పి చూశాడు. కానీ విమానం సిబ్బంది వినలేదు. చివరకు విమాన సిబ్బంది బలవంతం చేయడంతో వారు కిందకు దిగాల్సి వచ్చింది.

ఈ ఘ‌ట‌న‌పై ఎలిజ్ అర్భన్ స్పందిస్తూ.. ఏ మాత్రం కనికరం లేకుండా తమను బలవంతంగా దించేశారని.. ఆపై జీవితాంతం తాము యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించకుండా నిషేధం విధించారని ఎలిజ్ కన్నీరు పెట్టుకుంది. ఆపై విమానంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన వారంతా యునైటెడ్ ఎయిర్ లైన్స్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.




Next Story