ఊహించని నిర్ణయం తీసుకున్న యాహూ..!
Yahoo news sites to shut down in India. టెక్ దిగ్గజం యాహూ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో న్యూస్ ఆపరేషన్స్‌ను నిలిపివేస్
By Medi Samrat
టెక్ దిగ్గజం యాహూ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో న్యూస్ ఆపరేషన్స్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్ల పాటూ యాహూ న్యూస్ అందించింది. ఒకప్పుడు ఏదైనా వార్తలు చూడాలని అంటే యాహూను సంప్రదించేవారు. కానీ వీలైనన్ని న్యూస్ అందించే వెబ్ పోర్టల్స్ రావడంతో యాహూకు కూడా ఆదరణ తగ్గిపోతూ వచ్చింది. దీంతో సేవలకు ఆగష్టు 26తో ముగించారు. ఈ మేరకు న్యూస్ ఆధారిత వెబ్‌సైట్ల కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించిన యాహూ.. మెయిల్ సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. యాహూ గురువారం నుంచి ఎలాంటి కొత్త కంటెంట్‌ను పబ్లిష్ చేయలేదు. ఈ షట్‌డౌన్‌తో మిగతా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
''ఆగష్టు 26 నుంచి యాహూ ఇండియా.. ఎలాంటి కంటెంట్‌ను పబ్లిష్ చేయబోదు. యాహూ అకౌంట్‌తో పాటు మెయిల్, సెర్చ్ అనుభవాలపై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదు. యూజర్లు వాళ్ల అకౌంట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేద''ని యాహూ ఇండియా హోం పేజీలో ప్రకటించింది. ఎఫ్‌డీఐ కొత్త రూల్స్.. విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ స్పష్టం చేసింది. డిజిటల్ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే కొత్త చట్టాలు అనుమతించనున్నాయి. అక్టోబర్ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానుంది.