ప్రపంచపు మొట్టమొదటి SMSను వేలం వేయనున్న వోడాఫోన్
World's first SMS from 1992 to be auctioned. టెలికాం దిగ్గజం వోడాఫోన్ ప్రపంచంలోనే తొలి SMSను వేలం వేయనుంది.
By Medi Samrat
టెలికాం దిగ్గజం వోడాఫోన్ ప్రపంచంలోనే తొలి SMSను వేలం వేయనుంది. ఈ SMSని కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి 1992లో మరొక ఉద్యోగికి పంపారు. ప్రపంచంలోని మొట్టమొదటి టెక్ట్స్ మెసేజ్‌లో 14 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ దానిని నాన్-ఫంగబుల్ టోకెన్ (NFT)గా మారుస్తోంది. వోడాఫోన్ ట్విట్టర్ అధికారిక ఖాతాలో ఈ విషయాన్ని తెలిపింది. ఈ NFT వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని కంపెనీ శరణార్థులకు సహాయం చేయడానికి UNHCRకి విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపింది.
FOR SALE: World's first text message 💬, 1992 #NFT
— Vodafone UK (@VodafoneUK) December 14, 2021
Used once, over 14 characters, festive theme 🎄
To be auctioned 21/12 with proceeds going to @UNHCRUK 👇
ప్రపంచంలోని మొట్టమొదటి SMS సుమారు 30 సంవత్సరాల క్రితం డిసెంబర్ 3, 1992న పంపబడింది. ఇది కంపెనీ ఉద్యోగి అయిన రిచర్డ్ జార్విస్‌కు పంపబడింది. ఈ SMSలో 14 అక్షరాలు ఉన్నాయి. SMS ద్వారా జార్విస్ అందుకున్న టెక్ట్స్ 'మెర్రీ క్రిస్మస్' అని ఉంది. SMS వేలం డిసెంబర్ 21, 2021న నిర్వహించబడుతుందని.. ఇది ఫ్రాన్స్‌లో జరుగుతుందని కంపెనీ తెలిపింది. ఈ వేలాన్ని అగట్టెస్ ఆక్షన్ హౌస్ నిర్వహిస్తోందని వెల్లడించింది.
15 Letters that changed the world. @Vodafone auctions the #1stSMS as NFT. It's message "Merry Christmas". We will donate the proceeds to @UNHCR. @Celebrity Spread the word @tyler @cameron @saylor @MatthewRoszak @TimDraper @FEhrsam @cz_binance @jack @frank_thelen @Gemini pic.twitter.com/feZr3syAWl
— Vodafone Deutschland (@vodafone_de) December 15, 2021