అదృష్టం తలుపు తడితే.. జీవితం మలుపు తిరగడం ఖాయం. ఇప్పుడు అదే జరిగింది ఆ మహిళ జీవితంలో. ఎప్పటిలాగే ఆరోజు మార్నింగ్‌కు వెళ్లింది.. అంతే ఆ మహిళ జీవితం అనూహ్య మలుపు తిరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన నోరీన్‌ రిడ్‌ బెర్గ్‌ అనే మహిళ రోజులాగే దగ్గర్లోని అర్కన్‌సాస్‌ స్టేట్‌ పార్క్‌ కు మార్నింగ్‌ వాక్‌కు వెళ్లింది. వాకింగ్‌ చేస్తుండగా 4 క్యారెట్ల డైమండ్‌ దొరికింది. ఆ డైమండ్‌ విలువ దాదాపు రూ.15 లక్షల వరకు ఉంటుంది. పుసుపు కలర్‌లో తళతళ మెరిస్తున్న ఆ డైమండ్‌ ఆమె జీవితంలో వెలుగులు నింపింది. 1972లో ఇలాంటి డైమండ కనిపించిందని.. మళ్లీ ఇప్పుడు అలాంటి డైమండ్‌ దొరికిందని పార్క్‌ నిర్వాహకులు తెలిపారు.

1972 నుంచి ఇప్పటి వరకు ఈ పార్క్‌లో దాదాపుగా 75 వేల డైమండ్లు దొరికాయని పార్క్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సంవత్సరం అక్కడి ప్రజలకు 258 వజ్రాలు దొరికాయని స్థానిక మీడియా పేర్కొంది. ఇక పార్కును సందర్శించే వారికి రోజుకు రెండు వజ్రాలైన దొరుకుతాయట. అర్కన్‌సాస్‌ స్టేట్‌ పార్క్‌ డైమండ్లకు కేరాఫ్‌. ఇంకొ విషయం ఏమిటంటే.. ఇక్కడ డైమండ్ల కోసం వెతకొచ్చట. అగ్ని పర్వతం నుంచి వచ్చిన లావా మొత్తం ఇక్కడ విస్తరించి ఉంది. అందుకే ఈ పార్క్‌లో ఎక్కువగా వజ్రాలు దొరుకుతాయట.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story