ఆవును పెళ్లి చేసుకున్న 74 ఏళ్ల వృద్ధురాలు.. కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

Woman marries cow after it kissed her. తాజాగా 74 ఏళ్ల ఓ వృద్ధురాలు ఆవును పెళ్లి చేసుకుంది. వృద్ధాప్యంలో తన పెంపుడు ఆవుతో పెళ్లి పీటలు ఎక్కింది.

By అంజి  Published on  28 Nov 2021 12:45 PM IST
ఆవును పెళ్లి చేసుకున్న 74 ఏళ్ల వృద్ధురాలు.. కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

పురుషులు, మహిళలు పెళ్లి చేసుకోవడం సాధారణమైన విషయం. మహిళలు మహిళలతో, పురుషులు పురుషులతో పెళ్లి చేసుకోవడం విచిత్రం. కానీ మనుషులు జంతువులను పెళ్లి చేసుకోవడం ఇదో అసాధారణమైన విచిత్రం. ఇలాంటి పెళ్లిళ్లు గత కొంత కాలంగా ఎక్కువ అవుతున్నాయి. తాజాగా 74 ఏళ్ల ఓ వృద్ధురాలు ఆవును పెళ్లి చేసుకుంది. వృద్ధాప్యంలో తన పెంపుడు ఆవుతో పెళ్లి పీటలు ఎక్కింది. ఇక వీరి పెళ్లి వేడుక గ్రామస్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వెరైటీ పెళ్లి కంబోడియాలో జరిగింది. క్రతి ప్రావిన్స్‌కు చెందిన 74 ఏళ్ల వృద్ధురాలు ఖిమ్‌ హాంగ్‌. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కొన్నేళ్ల కిందట ఆమె భర్త అనారోగ్యం కారణంగా మరణించాడు. అప్పటి నుండి పశువులను పెంచుకుంటూ, వ్యవసాయం చేస్తూ జీవిస్తోంది. అయితే ఆమె ఆవును పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కొన్ని నెలల కిందట ఖిమ్‌ హాంగ్‌ ఇంట్లో ఆవుదూడ పుట్టింది. అప్పటి నుండి దానిని ఖిమ్‌ హాంగ్‌ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఆ ఆవుదూడతోనే ఎక్కువ సమయం గడిపేది. ఇక ఆవు కూడా ఖిమ్‌ హాంగ్‌ దగ్గరికి రాగనే చేతిని, నుదిటిని తన నాలుకతో నాకేది. ఇప్పుడు ఆవు పెద్దది అయింది. అయితే ఖిమ్‌ హాంగ్‌ తన పెంపుడు ఆవును పెళ్లి చేసుకుని అందరినీ షాక్‌కు గురి చేసింది.

ఖిమ్‌ హాంగ్‌ మాట్లాడుతూ.. "తన భర్త చూపించినట్లుగా ఆవు కూడా తనపై ఎంతో ప్రేమ చూపిస్తోంది. ఆవును ప్రేమను చూస్తుంటే.. అచ్చంగా తన భర్తే వచ్చినట్లు అనిపిస్తోంది. తన భర్త ఆవు రూపంలో మళ్లీ పుట్టాడు. అందుకే ఆవు రూపంలో ఉన్న తన భర్తను మళ్లీ పెళ్లి చేసుకున్నా" అని తెలిపింది. అయితే వృద్ధురాలు ఖిమ్‌ హాంగ్‌.. ఆవును పెళ్లి చేసుకుందని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు కానీ. స్థానిక ప్రజలు మాత్రం వారు తమ సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారని చెబుతున్నారు. ఖిమ్‌ హాంగ్‌ పడుకునే ముందు తన ఆవుకు దిండు కూడా ఇస్తుందట. ఒక వేళ తాను చనిపోయాక ఆవును ఆవుగా చూడవద్దని, తండ్రిగా చూసుకోవాలని తన కొడుకులకు ఖిమ్‌ హాంగ్‌ చెప్పారు. ఆవు మరణించాక మనిషికి అంత్యక్రియలు చేసినట్లు చేయాలని చెప్పింది.

Next Story