చికాగో నుంచి ఐస్‌ల్యాండ్‌కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో, ఒక మహిళకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ అమెరికన్ మహిళ మూడు గంటల పాటు విమానంలోని బాత్రూంలో ఒంటరిగా ఉంది. మీడియా నివేదికల ప్రకారం, మిచిగాన్‌కు చెందిన మరిస్సా ఫోటో అనే మహిళా ఉపాధ్యాయురాలు డిసెంబర్ 19న ప్రయాణిస్తున్న సమయంలో గొంతు నొప్పితో బాధపడుతోంది. దీని తర్వాత ఆమె ర్యాపిడ్ కరోనా టెస్ట్ చేయడానికి బాత్రూమ్‌కి వెళ్లింది. నివేదికలో తనకు కరోనా సోకినట్లు గుర్తించింది.
ఫ్లైట్‌కు ముందు ఆమె రెండు RTPCR పరీక్షలు కూడా చేయించుకుంది.. ఐదు ర్యాపిడ్ పరీక్షలు కూడా చేయించుకుంది. అన్ని రిపోర్టుల్లోనూ నెగిటివ్‌గా వచ్చింది. దాదాపు గంటన్నర పాటు ఫ్లైట్‌లో కూర్చున్న తర్వాత ఆమెకు గొంతు నొప్పిగా అనిపించింది. అప్పుడు నేనే కరోనా పరీక్ష చేయించుకోవాలని అనుకున్నాను. టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. ఆమె వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ను కూడా పొందింది. ఆమెకు నిరంతరం కరోనా పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఉన్న విమానం బాత్‌రూమ్‌లో తన కరోనా టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చిన తర్వాత ఆమె భయాందోళనకు గురైంది. దీంతో బాత్ రూమ్ లోపలి వెళ్ళిపోయి.. అలాగే ఉండిపోయింది.