భర్త చితా భస్మాన్ని తింటున్న భార్య.. షాకింగ్‌.!

Woman eats her dead husband ashes. బ్రిటన్‌లో ఓ మహిళ తనకున్న వింత అలవాటును చెప్పి అందరిని షాక్‌ గురి చేసింది. ప్రేమతో రోజు నా భర్తను

By అంజి  Published on  25 Oct 2021 12:14 PM IST
భర్త చితా భస్మాన్ని తింటున్న భార్య.. షాకింగ్‌.!

బ్రిటన్‌లో ఓ మహిళ తనకున్న వింత అలవాటును చెప్పి అందరిని షాక్‌ గురి చేసింది. ప్రేమతో రోజు నా భర్తను తింటున్నాను అన్న ఆమె వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇది వింతగా, షాకింగ్‌గా అనిపిస్తున్నా.. జరిగింది మాత్రం నిజం. 2009లో కాసీ అనే మహిళ సీన్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులకు అతడు అనారోగ్యం కారణంగా చనిపోయాడు. దీంతో భర్తపై ఇష్టన్ని మర్చిపోలేకపోతున్నానంటూ.. సీన్‌ చితాభస్మాన్ని రోజు భార్య కాసీ తింటోంది. తాను ఎక్కడికి వెళ్లినా.. భర్త చితాభస్మాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకుంది. పైగా ఆ బూడిద కూళ్లిన వాసన వస్తున్నప్పటికీ... కొంచెం కొంచెంగా ఆ బూడిదను తింటోంది.

ఈ భూమి మీద నుంచి తన భర్తను పూర్తిగా తడిచిపెట్టేయడం తనకిష్టం లేదని కాసీ చెబుతోంది. బూడిద తినడం వల్ల తన భర్త తనతోనే ఉన్నట్లుగా భావిస్తుంటానని కాసీ పేర్కొంది. టీసీఎల్ మై స్ట్రేంజ్‌ అడిక్షన్‌ కార్యక్రమంలో పాల్గొన్న కాసీ.. తనకున్న ఈ వింత అలవాటు గురించి చెప్పింది. '' నేను నా భర్త చితభస్మాన్ని కిరాణా షాపుకి, షాపింగ్‌కి, సినిమాలకు, ప్రతిచోటుకు తీసుకువెళ్తాను'' అని కాసీ చెప్పింది. సాధారణ ఆహారంలాగా బూడిద తినడం సాధ్యం కాదు. కానీ కేసీ.. తాను రోజుకు ఐదు నుండి ఆరు సార్లు బూడిదను తింటానని చెప్పింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గ మారాయి.

Next Story