మైఖేల్ జాక్సన్ ఆత్మ ఆమెను పెళ్లి చేసుకుందట.. అది తప్ప అన్నీ చేస్తోందట.!

Woman Claims She’s Married to Michael Jackson’s Ghost. పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ 12 ఏళ్ల కిందట గుండెపోటుతో మరణించాడు. మైఖేల్ లేని

By Medi Samrat
Published on : 20 Aug 2021 6:28 PM IST

మైఖేల్ జాక్సన్ ఆత్మ ఆమెను పెళ్లి చేసుకుందట.. అది తప్ప అన్నీ చేస్తోందట.!

పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ 12 ఏళ్ల కిందట గుండెపోటుతో మరణించాడు. మైఖేల్ లేని లోటును ఇప్పటికీ అభిమానులు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆయన మరణం చుట్టూ ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. ఇక మైఖేల్ చనిపోయిన తర్వాత ఆయన మ్యాన్షన్ లో దెయ్యంగా ఉన్నారంటూ కూడా కొన్ని కథనాలు వచ్చాయి. అవన్నీ పబ్లిసిటీ కోసం చేసినవేనని ఆ తర్వాత తెలిసింది. ఇప్పుడు బ్రిటన్ కు చెందిన ఓ మహిళ మైఖేల్ జాక్సన్ పేరును వాడుకొని పాపులర్ అవ్వాలని అనుకుంటూ ఉంది.

మైఖేల్ జాక్సన్ ఆత్మగా మారి తనను పెళ్లి చేసుకున్నాడని బ్రిటన్ కు చెందిన ఓ మహిళ చెబుతోంది. కాథ్లీన్ రాబర్ట్స్ మైఖేల్ జాక్సన్ ఆత్మతో కలిసి జీవిస్తున్నానని చెబుతోంది. జాక్సన్ తన శరీరంలోనే ఆవాసం ఏర్పరచుకుని ఉన్నాడని.. ఆ ఆత్మ తన శరీరంలో ఉంటూ శృంగారం తప్ప అన్ని పనులు చేస్తుందని తెలిపింది. ఒకవేళ తాను శృంగారానికి ప్రయత్నిస్తే జాక్సన్ సాలె పురుగుల నీడలు, శవాల ఆకారాలతో తనను భయభ్రాంతులకు గురిచేస్తాడని అంటోంది. డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, తనకిష్టమైన కుకీస్ తినడం ఇలా తనకు నచ్చిన విధంగా ఆస్వాదిస్తుంటాడని తెలిపింది.

మైఖేల్ జాక్సన్ కు మామూలుగా ఎంతో సిగ్గు అంట.. కానీ తనతో మాత్రం అనేక విషయాలు మాట్లాడుతుంటాడని ఆమె బ్రిటన్ మీడియాకు చెప్పింది. కాథ్లీన్ రాబర్ట్స్ గతంలో తాను హాలీవుడ్ తార మార్లిన్ మన్రో నంటూ ప్రకటించుకుంది. పునర్జన్మలను తాను నమ్ముతానని, మార్లిన్ మన్రోగా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న తాను ఈ జన్మలో బ్రిటన్ లో జన్మించానని అంటోంది. ఇప్పుడు మైఖేల్ జాక్సన్ ను వాడుకుంటూ ఉంది.


Next Story