27 సంవత్సరాల కిందట భార్యకు ఎక్కడైతే ప్రపోజ్ చేశాడో.. అక్కడే ప్రాణాలు కోల్పోయాడు..!

Where the husband proposed to his wife, he died. తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోడానికి రొమాంటిక్ ప్లేస్‌కి వెళ్లిన ఓ జంటకు

By Medi Samrat  Published on  13 Feb 2022 8:33 PM IST
27 సంవత్సరాల కిందట భార్యకు ఎక్కడైతే ప్రపోజ్ చేశాడో.. అక్కడే ప్రాణాలు కోల్పోయాడు..!

తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోడానికి రొమాంటిక్ ప్లేస్‌కి వెళ్లిన ఓ జంటకు ఊహించని ప్రమాదం జరిగింది. భర్త తన భార్యతో కలిసి ఒక కొండ మీదకు వెళ్ళాడు. ఈ కొండపైనే అతను కొన్నేళ్ల కిందట భార్యకు ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు చోటు చేసుకున్న ప్రమాదం కారణంగా 300 అడుగుల లోతులో ఉన్నలోయలో భర్త కాలు జారి పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. UKలోని మాంచెస్టర్‌లో నివసిస్తున్న 54 ఏళ్ల డాక్టర్ జామీ బట్లర్ తన భార్య మార్గరెట్‌తో కలిసి లేక్ డిస్ట్రిక్ట్‌లో విహారయాత్రకు వెళ్లాడు. ఇది సరస్సులు, కొండలతో నిండి ఉన్న గొప్ప ప్రదేశం. బట్లర్ అదే పర్వత ప్రాంతంలో 27 ఏళ్ల క్రితం మార్గరెట్‌కు పెళ్లి కోసం ప్రపోజ్ చేశాడు.

ఇప్పుడు ఇద్దరూ తమ పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసుకోవడానికి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. కానీ ఇక్కడ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈసారి వాళ్లు అక్కడికి వెళ్లిన సమయంలో కొండపై పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉంది. దీంతో కొండపై భార్యతో కలిసి నడుస్తుండగా బట్లర్ కాలు జారి 300 అడుగుల కింద లోయలోకి పడిపోయాడు. మౌంటెన్ రెస్క్యూ టీమ్ తర్వాత కొండ దిగువన డాక్టర్ బట్లర్ మృతదేహాన్ని కనుగొంది. అతని శరీరంపై చాలా గాయాల గుర్తులు ఉన్నాయి. తల కూడా పగిలిపోయింది. విచారణలో బట్లర్ మరణం ప్రమాదవశాత్తు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత మార్గరెట్ ఏడుస్తూ బట్లర్ తనను చాలా ప్రేమించే వాడని చెప్పింది. ఈ జంటకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.


Next Story