వ్యాక్సిన్ వేసుకోండి.. గంజాయి ఇస్తామంటున్న గవర్నమెంట్.!
Washington State allows for free marijuana joints with Covid-19 vaccine. ఎక్కువ మంది ప్రజలకు టీకాలు వేసే వ్యూహంలో భాగంగా
By Medi Samrat Published on 9 Jun 2021 3:22 AMఎక్కువ మంది ప్రజలకు టీకాలు వేసే వ్యూహంలో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రమైన వాషింగ్టన్ లో పెద్దలకు కోవిడ్ -19 టీకా షాట్ వేశాక ఉచిత గంజాయి అందించేందుకు అనుమతినిచ్చింది అక్కడి ప్రభుత్వం. "జాయింట్స్ ఫర్ జాబ్స్" అని పిలువబడే ఈ కార్యక్రమం వెంటనే అమలులోకి వస్తుందని.. జూలై 12 వరకు దీనిని కొనసాగిస్తామని వాషింగ్టన్ స్టేట్ లిక్కర్ అండ్ కాన్నబిస్ బోర్డు సోమవారం ప్రకటించింది.
21 ఏళ్ల వయస్సు లేదా అంతకంటే పెద్దవారు వ్యాక్సిన్ మొదటి లేదా రెండవ డోసును తీసుకున్నప్పుడు.. గంజాయి చిల్లర వ్యాపారులు వారి దుకాణాలలో ప్రీరోల్డ్ జాయింట్‌తో వినియోగదారులకు అందించడానికి అనుమతినిచ్చింది బోర్డు. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి అని తెలిపింది. ఇక న్యూయార్క్ టైమ్స్ డేటాబేస్ ప్రకారం.. వాషింగ్టన్‌లో ఇప్పటివరకు 49 శాతం మందికి పూర్తి టీకాలు ఇవ్వగా.. మిగిలిన వారిలో 58 శాతం మందికి పస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు.
ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారికి గంజాయి ఇవ్వడం వాషింగ్టన్ లోనే మొదటిసారి కాదు.. అంతకుముందు అరిజోనాలో కూడా ఇదే విధమైన కార్యక్రమాన్ని చేపట్టింది అక్కడి ప్రభుత్వం. వాషింగ్టన్ స్టేట్ లిక్కర్ అండ్ కాన్నబిస్ బోర్డు టీకా వేసుకున్న అక్కడి నివాసితులకు ఉచిత బీర్, వైన్ లేదా కాక్టెయిల్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది.
ఏప్రిల్ మధ్యలో వ్యాక్సినేషన్ బాగా తగ్గడంతో రాష్ట్రాలు.. పుల్ రైడ్ కళాశాల స్కాలర్‌షిప్‌లను గెలుచుకోవడానికి లాటరీలు కూడా నిర్వహించాయి. అంతేకాదు మరికొన్ని రాష్ట్రాలు 1 మిలియన్ లేదా అంతకంటే ఎక్కువ నగదు బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కల్పించాయి. ఈ విషయమై వైట్ హౌస్ సలహాదారు ఆండీ స్లావిట్ మాట్లాడుతూ.. ప్రజలకు టీకాలు వేయడానికి బైడెన్ ప్రభుత్వం సృజనాత్మకంగా రాష్ట్రాలను ప్రోత్సహించిందని అన్నారు.