రైఫిల్ కాలుస్తూ కనిపించిన పుతిన్
Vladimir Putin fires sniper rifle during Russian military camp visit. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాస్కోకు ఆగ్నేయంగా ఉన్న రియాజాన్‌లో సాయుధ సిబ్బంది
By Medi Samrat Published on 21 Oct 2022 5:45 PM ISTరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాస్కోకు ఆగ్నేయంగా ఉన్న రియాజాన్‌లో సాయుధ సిబ్బంది శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఆయన స్నిపర్ రైఫిల్‌తో కాల్చడం కనిపించింది. రష్యా క్షిపణి దాడుల కారణంగా వారంలో కనీసం 30 శాతం ఉక్రెయిన్ పవర్ స్టేషన్లను ధ్వంసం చేశాయి. ఒక వీడియోలో పుతిన్ మైదానంలో నెట్ కింద పడుకుని, గాగుల్స్ తో స్నిపర్ రైఫిల్‌ను కాల్చడం చూపించింది. ఓవర్‌కోట్ దుమ్ము దులపడం, ఒక సైనికుడి భుజంపై తట్టడం కూడా కనిపించింది.
📹WATCH: Russian President Vladimir Putin practices sniper rifle shooting at the training ground in Ryazan region. pic.twitter.com/iVAdG0Up8t
— 🇷🇺Jacob🇷🇺Charite🇷🇺 (@jaccocharite) October 20, 2022
విద్యుత్ వ్యవస్థే లక్ష్యంగా రష్యా, ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది. శీతాకాలం రావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి దేశం నుంచి వలసలు పెంచాలనే ఆలోచనలతోనే రష్యా ఇలా చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. యుద్ధంలో రష్యా, ఇరాన్ తయారీ కామికేజ్ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటితో ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్ వ్యవస్థలను కుప్పకూలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లో మూడింట ఒక వంతు విద్యుత్ వ్యవస్థ దెబ్బతిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ వెల్లడించారు. రష్యాకు సహాయపడుతున్నందుకు ఇరాన్ పై అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కోరాడు. శీతాకాలం ముంచుకువస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థలను పునరుద్ధరించే పనిలో ఉన్నాయి. 30 శాతం విద్యుత్ కేంద్రాలు ధ్వంసం అయ్యాయి. తమ దేశంలో ఇంధన సంక్షోభం సృష్టించి ప్రజలు యూరప్ దేశాలకు పారిపోయేలా రష్యా ప్రణాళిక రచించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఆరోపించారు.