100 ఏళ్ళ నుంచి ఒంటరిగా ఉన్న ఇల్లు.. ఎక్కడో తెలుసా?

V‌iral Photo Remote Island has been empty 100 years. సాధారణంగా జనావాసాలలో నివసిస్తున్నప్పటికీ కొన్నిసార్లు ఎంతో

By Medi Samrat  Published on  16 Dec 2020 7:22 AM GMT
100 ఏళ్ళ నుంచి ఒంటరిగా ఉన్న ఇల్లు.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా జనావాసాలలో నివసిస్తున్నప్పటికీ కొన్నిసార్లు ఎంతో బోరుగా అనిపిస్తుంది. చుట్టు పక్కన మాట్లాడిన వారు ఎవరూ లేకపోతే ఏదో కోల్పోయిన భావన మనలో కలుగుతుంది. అంతే కాకుండా ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు చుట్టుపక్కల వారు ఒకరికొకరు సహాయంగా ఉంటారు. ఇలా అందరి మధ్య కలిసి ఉంటే ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతుంటారు. మరికొందరు మాత్రం వారికి పూర్తి స్వేచ్ఛ కావాలని ఫాంహౌస్ లోనో ఇల్లు కట్టుకొని జీవిస్తుంటారు. అచ్చం అలాంటి ఇల్లు ఇక్కడ దాదాపు 100 సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉంది.

ఐస్లాండ్‌కు దక్షిణాన ఉన్న రిమోట్ ద్వీపమైన ఎల్లియే ద్వీపంలో గత పది సంవత్సరాల నుంచి ఒక వైట్ హౌస్ ఒంటరిగానే ఉంది. చుట్టూ సముద్రం, ఆ సముద్రం మధ్యలో ఒక ద్వీపం, ఆ ద్వీపంలో ఒక వైట్ హౌస్ నిర్మించబడింది ఉంది. దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం ఈ ద్వీపంలో ఐదు కుటుంబాలు నివసించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అయితే ఆ ద్వీపంలో నివసించే ప్రజలు చేపల పట్టుకోవడం, పఫిన్‌లను వేటాడటం, పశువుల పెంపకం పై వారి జీవితం ఆధారపడి ఉండేదని తెలుస్తోంది. అయితే కొద్ది కాలానికి అక్కడ నివసించే ప్రజలు ఆ ద్వీపం నుంచి ఇతర ప్రాంతాలకు వలస పోవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ద్వీపంలో ఉన్న వైట్ హౌస్ ఒంటరిగానే మిగిలిపోయింది.

ప్రస్తుతం ఆ ద్వీపంలో ఉన్న ఈ వైట్ హౌస్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఫోటోను చూసిన నెటిజన్లు దీనిపై పలు రకాలుగా స్పందిస్తున్నారు.ప్రస్తుతం ఈద్వీపంలో ఎటువంటి ఇల్లులేదు కేవలం ఫోటోషాప్‌లో ఎడిట్‌ చేసిన ఫోటోస్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఇంటిని ఒక బిలీనియర్‌ నిర్మించాడని ,జోంబీ అపోకాలిప్స్ సందర్భంలో ఆయన అక్కడికి వెళ్ళి జీవించాలనుకున్నట్లు కొన్ని పుకార్లు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.


Next Story