హారం అంత పెద్దగా ఉంది ఏంటి.!

Video Of Pakistan Groom With Currency Garland Shocks Internet. పెళ్లిళ్లలో పూల దండలు, హారాలు చాలా కామన్..!

By Medi Samrat  Published on  22 Oct 2022 1:45 PM GMT
హారం అంత పెద్దగా ఉంది ఏంటి.!

పెళ్లిళ్లలో పూల దండలు, హారాలు చాలా కామన్..! ఒక్కొక్కరు ఒక్కో రకమైన హారం వేసుకుంటూ ఉంటారు. కొందరు కావాలనే చాలా పెద్ద హారాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద హారానికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతూ ఉంది. ఆ హారం ఎంత పెద్దగా ఉందంటే ఏకంగా స్టేజీ మీద నుండి కింద దాకా ఉంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పాకిస్థాన్‌ కరెన్సీ నోట్లతో చేసిన భారీ దండతో వరుడు నిలబడి ఉన్నాడు. దండ చాలా పెద్దది కావడంతో వరుడు తన స్నేహితుల సహాయం తీసుకుని పెళ్లి వేదిక నుండి ప్రదర్శించాడు. వరుడు ఇంకో ఆరుగురు వ్యక్తులు దండ వెనుక దాగి ఉన్నారు. ఈ వీడియోను అనేక మంది వినియోగదారులు ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేసారు. సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రకారం ఈ వీడియో ఇస్లామాబాద్‌లో చిత్రీకరించబడింది.


Next Story