ఎట్టకేలకు నెరవేరిన ట్రంప్ 'నోబెల్' కోరిక..కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ ప్రైజ్ కోరిక ఎట్టకేలకు నెరవేరింది.

By -  Knakam Karthik
Published on : 16 Jan 2026 10:26 AM IST

International News, America, Donald Trump, Maria Corina Machado, Venezuela, Nobel Peace Prize, Venezuelan politics

ఎట్టకేలకు నెరవేరిన ట్రంప్ 'నోబెల్' కోరిక..కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ ప్రైజ్ కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఇప్పటివరకు 8 యుద్ధాలను ఆపినట్లు చెప్పుకున్న ఆయన..తనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందేనని చాలా వేదికలపై డిమాండ్ చేశారు. అయితే ఈ క్రమంలోనే వెనెజువెలా విపక్ష నేత, 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా మచాడో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తన నోబెల్ బహుమతి పతకాన్ని బహూకరించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవి నుంచి తొలగించడంలో ట్రంప్ చూపిన చొరవకు కృతజ్ఞతగా ఈ బహుమతిని సమర్పించినట్లు ఆమె వెల్లడించారు.

గురువారం వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో మారియా మచాడో సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. "మా స్వేచ్ఛ కోసం ట్రంప్ చూపిన అసమాన నిబద్ధతకు గుర్తింపుగా ఈ నోబెల్ పతకాన్ని ఆయనకు అందించాను" అని ప్రకటించారు. అయితే, ట్రంప్ ఈ పతకాన్ని భౌతికంగా స్వీకరించారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

ఈ పరిణామంపై నార్వేజియన్ నోబెల్ ఇనిస్టిట్యూట్ స్పందించింది. బహుమతి పతకాన్ని ఒకరి నుంచి మరొకరు తీసుకోవచ్చని, కానీ నోబెల్ గ్రహీత హోదాను మాత్రం బదిలీ చేయడం, పంచుకోవడం లేదా రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

Next Story