భారత్‌పై ప్రయాణాల ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా..!
USA lifting severe travel restrictions. భారత్‌పై విధించిన ప్రయాణ ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. భారత్‌తో పాటు పలు దేశాలపై కూడా ఆంక్షలను ఎత్తివేసిన
By అంజి Published on 26 Oct 2021 1:36 PM ISTభారత్‌పై విధించిన ప్రయాణ ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. భారత్‌తో పాటు పలు దేశాలపై కూడా ఆంక్షలను ఎత్తివేసిన అమెరికా ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నిబంధనలు నవంబర్ 8వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. కరోనా విజృంభణతో గత సంవత్సరం అమెరికా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రయోజనాల దృష్ట్యా ఆంక్షల్ని సడలిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. వ్యాక్సిన్ ఆధారిత అంతర్జాతీయ ప్రయాణాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిని నవంబర్ 8 నుంచి అమెరికాలోకి అనుమతించనున్నారు. ప్రయాణికులు విమానం ఎక్కేముందే తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా, డబ్ల్యుహెచ్‌వో గుర్తించిన వ్యాక్సిన్లు తీసుకున్నవారికి అమెరికాలోకి అనుమతి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న కూడా కరోనా నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రెండేళ్ల పిల్లలకు కొవిడ్ టెస్టు అవసరం లేదని నిబంధనల్లో స్పష్టం చేశారు. అలాగే వ్యాక్సినేషన్ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉన్న సుమారు 50 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సైతం ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించింది. వీరు అమెరికాకు వచ్చిన రెండు నెలల్లోగా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
అలాగే ఎయిర్‌లైన్స్ సంస్థలకు కూడా తాజాగా జారీ చేసిన నిబంధనల్లోనే విధి విధానాలను వెలువరించింది. ప్రయాణికుల సమాచారంతో పాటు, సీడీసీ కాంటాక్ట్ ట్రేసింగ్‌కు సంబంధించి నిబంధనలు జారీ చేసింది. గుర్తింపు పొందిన వ్యాక్సిన్లతో పాటు మిక్స్‌డ్ డోసుల విషయంలో కూడా తాజా నిబంధనల్లో వెసులుబాటు కల్పించింది.