మిచిగాన్ కు చెందిన ఓ తల్లి తన కుమారుడిని హత్య చేసింది. అతడి 18వ పుట్టినరోజు ముందు కొడుకును హత్య చేసిందని పోలీసులు నివేదించారు. 39 సంవత్సరాల కేటీ లీ సొంత కొడుకును అత్యంత దారుణంగా హత్య చేసింది. ఫిబ్రవరి 21న లీ తన కుమారుడు 17 ఏళ్ల ఆస్టిన్ డీన్ పికార్ట్ ను హత్య చేసింది.
లీ తన కుమారుడు ఆస్టిన్ తో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు పోలీసులకు తెలిపింది. ఇద్దరూ కొన్ని మందులను వేసుకున్నారు. ఆస్టిన్ స్పృహ కోల్పోయాక ఆమె తన కుమారుడిపై కత్తితో దాడి చేసి హత మార్చింది. తన కుమారుడు 18 సంవత్సరాలు నిండడం తనకు అసలు ఇష్టం లేదని అందుకే చంపేయాలని అనుకున్నానని లీ చెప్పడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. తన కొడుకుతో కలిసి ఉండేందుకు అధికారులు తనను చంపేయాలని పోలీసులకు చెప్పింది లీ. ఆన్‌లైన్ రికార్డుల ప్రకారం.. ఆమె మార్చి 4న కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.