షాకింగ్: వెదర్‌ రిపోర్ట్‌లో.. స్పష్టంగా అశ్లీల వీడియో టెలికాస్ట్‌..!

US tv channel shocking clip. అది సాయంత్రం సమయం.. అందరూ టీవీ చానల్‌ చూస్తున్నారు. యాంకర్‌ వెదర్‌ రిపోర్ట్‌ చదువుతోంది. ఏమైందో ఏమో..

By అంజి  Published on  21 Oct 2021 9:51 AM GMT
షాకింగ్: వెదర్‌ రిపోర్ట్‌లో.. స్పష్టంగా అశ్లీల వీడియో టెలికాస్ట్‌..!

అది సాయంత్రం సమయం.. అందరూ టీవీ చానల్‌ చూస్తున్నారు. యాంకర్‌ వెదర్‌ రిపోర్ట్‌ చదువుతోంది. ఏమైందో ఏమో.. కానీ ఉన్నపలంగా టీవీలో అశ్లీల వీడియో టెలికాస్ట్ అయింది. దీంతో టీవీ చూస్తున్న వీక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం అమెరికాలో జరిగింది. స్థానిక టీవీ చానల్‌లో వెదర్‌ రిపోర్ట్‌ బులిటెన్‌లో అశ్లీల వీడియో ప్రసారం కావడం.. ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈవినింగ్ న్యూస్‌ టైమ్‌లో వెదర్‌ రిపోర్టింగ్‌ను ప్రముఖ వాతావరణ నిపుణురాలు మిషెల్‌ బాస్‌ చెబుతున్నారు.

ఈ క్రమంలోనే 13 సెకన్ల పాటు స్పష్టమైన అశ్లీల వీడియో టెలికాస్ట్‌ అయింది. అయితే ఈ విషయాన్ని యాంకర్, కో యాంకర్‌, కోడి ప్రోక్టర్‌ గానీ దీన్ని గమనించలేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రాఫిక్‌ వీడియో వచ్చేదాకా ఈ వీడియో టెలికాస్ట్ అయింది. దీనిపై స్పందించిన ఆ టీవీ చానల్‌ జరిగిన తప్పుకు.. క్షమాపణలు తెలిపింది. మరెప్పుడూ ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామని తెలిపింది. ఈ ఘటనపై వీక్షకుల నుండి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు.

Next Story