అలాస్కాలో పుతిన్ ప‌ర్య‌ట‌న‌.. మోకాళ్లపై కూర్చొని ఉన్న‌ అమెరికా సైనికుల ఫోటోపై ఉక్రెయిన్ మండిపాటు

US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2018 తర్వాత ఒకరికొకరు ఎదురుప‌డ్డారు.

By Medi Samrat
Published on : 16 Aug 2025 12:46 PM IST

అలాస్కాలో పుతిన్ ప‌ర్య‌ట‌న‌.. మోకాళ్లపై కూర్చొని ఉన్న‌ అమెరికా సైనికుల ఫోటోపై ఉక్రెయిన్ మండిపాటు

US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2018 తర్వాత ఒకరికొకరు ఎదురుప‌డ్డారు. గత సాయంత్రం అలస్కాలో 3 గంటలపాటు ఇద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు. అయితే అలాస్కాలో పుతిన్ ఎంట్రీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అమెరికా సైనికులు రష్యా అధ్యక్షుడి విమానం ముందు మోకాళ్లపై కూర్చొని ఉన్నారు. దీనిపై ఉక్రెయిన్ ఫెస్టివల్ అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మాస్టర్ డీల్ మేకర్ అని చెప్పుకునే ట్రంప్ శుక్రవారం అలస్కా ఎయిర్‌బేస్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత పుతిన్ కూడా మొదటిసారి అమెరికా గడ్డపై అడుగుపెట్టాడు. అటువంటి పరిస్థితిలో పుతిన్ విమానం అలాస్కాలో ల్యాండ్ అయిన వెంటనే అమెరికన్ సైనికులు త్వరగా వంగి, పుతిన్‌కు స్వాగతం పలికేందుకు రెడ్ కార్పెట్ వేయడం ప్రారంభించారు.

పుతిన్‌కు స్వాగతం పలికేందుకు అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా అక్కడికి చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత పుతిన్ ట్రంప్ వైపు వెళ్లగానే.. ట్రంప్ చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుతూ కరచాలనం చేసుకున్నారు. ప్రపంచం మొత్తం ఈ చారిత్రక ఘట్టాన్ని వీడియోల‌లో చూసింది. అయితే.. పుతిన్‌కు అమెరికా సైనికులు కార్పెట్‌ పరిచిన చిత్రం ఉక్రెయిన్‌కు నచ్చలేదు. ఉక్రెయిన్ మాజీ అధికారి ముస్తఫా నయ్యమ్ ఈ ఫోటోను పోస్ట్ చేశారు.

పుతిన్‌తో 3 గంటలపాటు జరిగిన భేటీ సానుకూలంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ భేటీలో కాల్పుల విరమణపై ఏకాభిప్రాయం కుదరలేదని ట్రంప్ చెబుతున్నారు. అయితే ఇరువురు నేతలు పలు విషయాలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశం ముగిసిన తర్వాత యుద్ధాన్ని ముగించడం ఇప్పుడు జెలెన్స్కీ చేతిలో ఉందని ట్రంప్ అన్నారు. ఐరోపా దేశాలకు కూడా ఇందులో కొంత సహకారం ఉంటుందన్నారు.


Next Story