అమెరికా.. ఈ దేశాన్ని సందర్శించాలని ఎంతో మందికి ఉంటుంది. అయితే కరోనా కారణంగా ఆ దేశానికి వెళ్లాలంటే తీవ్రమైన ఆంక్షలు విధించారు. అమెరికాలో కూడా పెద్ద ఎత్తున కరోనా కారణంగా మరణించారు. అయితే ఈ మధ్య కరోనా ప్రభావం ప్రపంచ దేశాల్లో తగ్గడంతో ఆంక్షలపై అమెరికా కూడా పునరాలోచించింది. అమెరికా త‌న స‌రిహ‌ద్దుల్ని తెరిచి.. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న‌వారిని తమ దేశానికి రావాలని కోరుతోంది. మెక్సికో, కెన‌డా స‌రిహ‌ద్దుల్ని న‌వంబ‌ర్‌ నెలలో తెర‌వ‌నుంది అమెరికా. 19 నెల‌ల విరామం త‌ర్వాత మ‌ళ్లీ స‌రిహ‌ద్దుల ద్వారా విదేశీ టూరిస్టుల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు.

కంప్లీట్ వ్యాక్సిన్ తీసుకున్న టూరిస్టుల‌కు మాత్ర‌మే ప్ర‌స్తుతం అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. విదేశీ ప్ర‌యాణికుల‌కు సంబంధించిన పూర్తి స్థాయి కొత్త విధానాన్ని త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు. ప్ర‌యాణంపై ఆంక్ష‌ల‌ను స‌డ‌లించాల‌ని మెక్సికో, కెన‌డా దేశాలు అమెరికాను కోరుతున్నాయి. విమాన ప్ర‌యాణికులు, వాహ‌నాలు, రైళ్లు, ఫెర్రీల ద్వారా అమెరికాలోకి వచ్చే వాళ్లు వ్యాక్సిన్ రిపోర్ట్ చూపించాల‌ని అమెరికా అధికారులు చెబుతున్నారు. పలు దేశాలు ఇటీవలి కాలంలో ఆంక్షలను సడలించాయి. వ్యాక్సిన్ వేయించుకున్న ఇతర దేశస్థులకు స్వగతం పలుకుతున్నాయి.


సామ్రాట్

Next Story