87 మంది పిల్లలకు తండ్రి.. ఈ సంవత్సరం సెంచరీ లక్ష్యం..!
అమెరికాకు చెందిన 32 ఏళ్ల కైల్ గోర్డి ఇప్పటి వరకు 87 మంది పిల్లలకు తండ్రిగా మారి 100కు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు
By Medi Samrat Published on 17 Jan 2025 9:44 AM ISTఅమెరికాకు చెందిన 32 ఏళ్ల కైల్ గోర్డి ఇప్పటి వరకు 87 మంది పిల్లలకు తండ్రిగా మారి 100కు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కైల్ గోర్డి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ స్పెర్మ్(వీర్యం) దాత. అతడు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 87 మంది పిల్లలకు జీవసంబంధమైన తండ్రి అయ్యాడు. ఈ వ్యక్తి 2026 నాటికి ప్రతి దేశంలో బిడ్డను కలిగి ఉంటానని చెబుతున్నాడు.
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. బి ప్రెగ్నెంట్ నౌ వెబ్‌సైట్ ద్వారా మిస్టర్ గోర్డి తన సేవలను ఉచితంగా అందిస్తున్నాడు. ఇప్పటివరకు.. అతడు ప్రపంచవ్యాప్తంగా 87 మంది పిల్లలకు జీవసంబంధమైన తండ్రి అయ్యాడు. ఈ సంవత్సరం 100 మందికి పైగా పిల్లలకు తండ్రి అవుతాడని అతను ఇటీవల తెలుసుకున్నాడు. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 3 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తన సేవలు కావాలనుకునే మహిళలను కూడా ఆహ్వానిస్తాడు. అవసరమైన వ్యక్తులకు సహాయం చేయడానికి తన మిషన్ ప్రారంభించినట్లు గోర్డీ పేర్కొన్నాడు.
'ఈ ఏడాది ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. నేను ఇంకా స్పెర్మ్ దానం చేయని దేశాలకు వెళ్లాలనుకుంటున్నాను. జపాన్, ఐర్లాండ్ అటువంటి దేశాలు. ఈ దేశాలకు చెందిన మహిళలతో నేను టచ్‌లో ఉన్నాను. ఈ సంవత్సరం నేను జపాన్, ఐర్లాండ్, కొరియాలో పిల్లలకు తండ్రిని అయ్యే సంవత్సరం కావచ్చని పేర్కొన్నాడు. పిల్లలు అవసరమని భావించిన మహిళలకు సహాయం చేస్తున్నందుకు నేను గర్వపడుతున్నానని పేర్కొన్నాడు.
కైల్ గోర్డి టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌ను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. పావెల్ దురోవ్ కూడా 12 దేశాలలో కనీసం 100 మంది జీవసంబంధమైన పిల్లలను కలిగి ఉన్నాడు.
అయితే గోర్డీకి నిర్దిష్ట లక్ష్య సంఖ్య అంటూ ఏమీ లేదు.. తన సేవలు అవసరం ఉన్న వరకు స్పెర్మ్ విరాళం అందజేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కైల్ గోర్డి మాట్లాడుతూ.. 'మహిళలందరికీ ఇది సాధ్యం కాదు. అలాంటి మహిళలు కుటుంబాలు ప్రారంభించడంలో సహాయం చేసినందుకు నేను సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు.