అమెరికాకు చెందిన ఒక వ్యక్తి కారు డాష్‌బోర్డ్‌లో పాము కనిపించడం ఇంటర్నెట్ యూజర్లను షాక్ కు గురిచేసింది. Xలో వైరల్ అవుతున్న పోస్ట్‌లో సైమన్ సర్రిస్ అనే వ్యక్తి తనతో పాటూ కారులో ఎప్పుడూ ఊహించని ప్రయాణీకుడి ఫోటోలను పంచుకున్నాడు. అతని హై-ఎండ్ కారు ఎయిర్ కండిషనింగ్ వెంట్ నుండి పాము బయటకు చూస్తోంది.
ఒక యూజర్ పామును బయటకు తీయడానికి ప్రయత్నించారా అని అడిగినప్పుడు. “నేను కిటికీ తెరిచి ఉంచాను, కానీ పాము విండ్‌షీల్డ్‌ని చూసి గందరగోళానికి గురవుతోంది. కాబట్టి బయటకు తీయడానికి తాను పట్టుకోవలసి ఉంటుంది.” అని సైమన్ వివరించాడు.
ఈ పోస్ట్ కు లక్షలాదికి పైగా వ్యూస్ వచ్చాయి. అనేక మంది వినియోగదారులు తమ తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఉన్నారు. చాలా మంది వినియోగదారులు ఆ ఫోటోలను చూసి నవ్వగా, మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.