ఖషోగ్గి హత్య.. సౌదీ అరేబియా ప్రజల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా

US implicates Saudi crown prince in Khashoggi's killing. 2018లో ట‌ర్కీ రాజ‌ధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ కౌన్సులేట్‌లో

By Medi Samrat  Published on  27 Feb 2021 1:21 PM GMT
ఖషోగ్గి హత్య.. సౌదీ అరేబియా ప్రజల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా

2018లో ట‌ర్కీ రాజ‌ధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ కౌన్సులేట్‌లో జ‌ర్న‌లిస్టు జ‌మాల్ ఖ‌షోగ్గి దారుణ హ‌త్య‌కు గురైన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా రాజు మహ్మ‌ద్ బిన్ స‌ల్మాన్ ఆదేశాల మేర‌కు జ‌ర్న‌లిస్టు జ‌మాల్ ఖ‌షోగ్గి హ‌త్య జ‌రిగిన‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. ఖ‌షో‍గ్గిని బంధించండి లేదా హ‌త్య చేయాలంటూ ప్రిన్స్ స‌ల్మాన్ ఆదేశించిన‌ట్లు ఆ నివేదిక‌లో తెలిపింది. అమెరికా రిలీజ్ చేసిన నివేదిక‌ను సౌదీ అరేబియా కొట్టిపారేసింది. అదో నెగ‌టివ్‌, త‌ప్పుడు రిపోర్ట్ అని పేర్కొన్న‌ది.

జ‌ర్న‌లిస్టు ఖ‌షోగ్గి మ‌ర్డ‌ర్ కేసులో త‌న పాత్ర‌లేద‌ని సౌదీ రాజు మహ్మ‌ద్ తెలిపారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుగా పేరుగాంచిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ ఖషోగ్గి హత్య 2018, అక్టోబర్ 2న జరిగింది. ఖషోగ్గి తన మ్యారేజ్‌ పేపర్స్‌ కోసం కాన్సులేట్‌ భవనంలోకి వెళ్లాడు. ఆ తర్వాత నుంచి అతడు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో కొన్ని పాశ్చాత్య దేశాలు, సీఐఏ ఖషోగ్గి హత్య వెనక సౌదీ రాజు ప్రమేయం ఉందని ఆరోపించాయి.

దీంతో సౌదీ అరేబియాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశ పౌరులకు వీసా నిషేదిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 76 మంది సౌదీ పౌరులకు అమెరికా ప్రభుత్వం వీసాను నిషేధించింది. జర్నలిస్టులు, ప్రభుత్వంపై అసమ్మతి తెలియజేస్తూ వారిపై దాడులకు తెగబడే వారికి ఆంక్షలు విధించేలా అమెరికా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ విధానాల ప్రకారమే 76 మందిపై అగ్రరాజ్యం వీసాను నిషేధించింది. అంతేగాక వారి కుటుంబ సభ్యుల్లో ఎంపిక చేసిన వారికే వీసా ఆంక్షలు వర్తిస్తాయి ప్రకటనలో పేర్కొంది.


Next Story