వ్యాక్సిన్ తీసుకున్న హెడ్ నర్సు.. మీడియాతో మాట్లాడుతూ కుప్పకూలిపోగా ..
US head nurse faints during press briefing, received COVID vaccine shot hours back. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రస్తుతం
By Medi Samrat Published on 19 Dec 2020 10:59 AM GMT
కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. వ్యాక్సిన్ తీసుకుంటున్న కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఓ నర్స్ కుప్పకూలిపోవడం సంచలనం అయింది. అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్,కు అత్యవసర అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెన్నెస్సీలో ఓ హెడ్ నర్సు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కొన్ని నిమిషాలకే కుప్పకూలిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
హెడ్ నర్సు టిఫానీ డోవర్ కరోనా డోసు తీసుకున్న అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి వచ్చింది. అలా మాట్లాడుతుండగానే ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. వ్యాక్సిన్ వేయించుకోవడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నానని చెబుతున్నప్పుడే.. సారీ, నాకేదో అవుతోంది అంటూనే కుప్పకూలిపోయింది. స్పృహకోల్పోయిన ఆ హెడ్ నర్సు టిఫానీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఏమీ అవ్వలేదని అధికారులు తెలిపారు. ఆమె స్పృహ తప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.
మోడెర్నా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ 'ఎంఆర్ఎన్ఏ-1273'కు త్వరలోనే అమెరికా ఆహార, ఔషధ సంస్థ ఎఫ్‌డీఏ అనుమతులు లభించనున్నాయి. మోడెర్నా టీకాకు అనుమతి ఇవ్వొచ్చంటూ నిపుణుల కమిటీ ఎఫ్‌డీఏకు సిఫార్సు చేసింది. 18 ఏళ్లు, ఆ పైన వయసున్న వారికి ఈ టీకా పూర్తి సురక్షితమేనని కమిటీ చెబుతోంది.