ప్రపంచాన్ని నాశనం చేసే వాదనను పునరుద్ఘాటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికా వద్ద ఇప్పటికే చాలా అణ్వాయుధాలు ఉన్నాయని, ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేయవచ్చని అన్నారు. ప్రపంచం మొత్తంలో అమెరికా నంబర్ వన్ అని కూడా ట్రంప్ అన్నారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో జరిగిన భేటీని అద్భుతంగా అభివర్ణిస్తూ.. తన అంతిమ లక్ష్యం అణ్వాయుధ నిర్మూలన అని అన్నారు. "అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని నేను భావిస్తున్నాను. మనం ప్రపంచాన్ని 150 రెట్లు నాశనం చేయగలము."
వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. అణు సామర్థ్యాల్లో అమెరికా మొదటి స్థానంలో, రష్యా రెండో స్థానంలో, చైనా మూడో స్థానంలో ఉన్నాయి.. తాము చాలా వెనుకబడి ఉన్నా.. వచ్చే ఐదేళ్లలో సమానంగా ఉంటామన్నారు. దాని అవసరం లేదు, నేను వ్లాదిమిర్ పుతిన్, జి జిన్‌పింగ్‌తో మాట్లాడాను. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆ డబ్బును ఇతర పనులకు ఖర్చు చేయాలనుకుంటున్నారని అన్నారు.
“నేను ప్రపంచమంతటా శాంతిని కోరుకుంటున్నాను. అమెరికా అణు పరీక్షలను తిరిగి ప్రారంభిస్తుందని.. ఆయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని పెంటగాన్‌ను ఆదేశించినట్లు గత వారం తను ఇచ్చిన ప్రకటన తర్వాతే ట్రంప్ వ్యాఖ్యలు వచ్చాయి. ఆ సమయంలో ట్రంప్ మాట్లాడుతూ.. "మీరు అతి త్వరలో చూస్తారు. మేము కొన్ని పరీక్షలు చేయబోతున్నాం, అవును. ఇతర దేశాలు అలా పరీక్షలు చేస్తున్నాయి. వారు చేస్తున్నట్లుగానే, మేము కూడా చేస్తాము అని అన్నారు.