అమెరికాలో స్థిరపడాలనుకున్న వారికి ట్రంప్ షాక్..గోల్డ్ కార్డు స్కీమ్‌తో ఆశలపై నీళ్లు
'గోల్డ్ కార్డ్' పౌరసత్వ పథకం కింద అమెరికా సంస్థలు ఇప్పుడు భారతీయ గ్రాడ్యుయేట్లను నియమించుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 9:38 AM IST
అమెరికాలో స్థిరపడాలనుకున్న వారికి ట్రంప్ షాక్..గోల్డ్ కార్డు స్కీమ్‌తో ఆశలపై నీళ్లు
'గోల్డ్ కార్డ్' పౌరసత్వ పథకం కింద అమెరికా సంస్థలు ఇప్పుడు భారతీయ గ్రాడ్యుయేట్లను నియమించుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా పౌరసత్వాన్ని పొందాలని ఆశిస్తున్న సంపన్న విదేశీ వలసదారుల కోసం ఓ కొత్త పథకాన్ని తీసుకురానున్నట్టు ట్రంప్ అనౌన్స్ చేశారు. గోల్డ్ కార్డులను కొనుగోలు చేయడం ద్వారా అమెరికా పౌరసత్వాన్ని సులభంగా పొందే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. 5 మిలియన్ డాలర్లకు(సుమారు రూ.44 కోట్లు) గోల్డ్ కార్డులను విక్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ గోల్డ్ కార్డులు గ్రీన్ కార్డు నివాసంతో సమానమని, విదేశీయులు అమెరికన్ పౌరసత్వాన్ని పొందడానికి ఇది మార్గమని ట్రంప్ ప్రకటించారు.
సుమారు 1 కోటి గోల్డ్ కార్డులను విక్రయిస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం వల్ల దేశం ఎదుర్కొంటున్న రుణ భారం తొలగిపోతుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఈబీ-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డులు వస్తాయని ఆయన వివరించారు. ఈబీ-5 వీసా కార్యక్రమం ద్వారా విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును అమెరికాలో పెట్టుబడి పట్డడం ద్వారా ఉద్యోగాలు పొందడంతోపాటు ఉద్యోగలను సృష్టించవచ్చు.
అంతేగాక శాశ్వత నివాస హోదాను కూడా పొందవచ్చు. అమెరికన్ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే విదేశీ సంపన్నులకు ఈబీ-5 ప్రోగ్రామ్ కింద గ్రీన్ కార్డులను ప్రసాదిస్తారు. కాగా, ఈ ప్రోగ్రామ్‌ను రద్దు చేసి గోల్డ్ కార్డుల విక్రయాన్ని ప్రారంభించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. గోల్డ్ కార్డులకు 5 మిలియన్ డాలర్ల చొప్పున వెల కడుతున్నామని ఆయన చెప్పారు. ఇది గ్రీన్ కార్డు అధికారాలు కల్పించడంతోపాటు అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు దారి కాగలదని ఆయన తెలిపారు. మరో రెండు వారాలలో ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ట్రంప్ తెలిపారు.