ఎక్కడ రష్యన్ సైన్యం అత్యాచారం చేస్తుందో.. జుట్టును కత్తిరించేసుకుంటున్న అమ్మాయిలు
Ukrainian Girls Cutting Hair To Avoid Being Raped By Russians. రష్యా దళాల కారణంగా ఉక్రెయిన్ ప్రజలు అనుభవించిన బాధను వివరించిన ఉక్రేనియన్ అధికారి
By Medi Samrat Published on 8 April 2022 3:15 PM GMTరష్యా దళాల కారణంగా ఉక్రెయిన్ ప్రజలు అనుభవించిన బాధను వివరించిన ఉక్రేనియన్ అధికారి కన్నీళ్లు పెట్టుకున్నారు. 15 మరియు 16 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు అక్కాచెల్లెళ్లు రష్యా సైనికులచే అత్యాచారానికి గురయ్యారని ఇవాన్‌కివ్ డిప్యూటీ మేయర్ మేరీనా బెస్చాస్ట్నా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. "ఒక గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళపై అత్యాచారం జరిగింది.. వారు 15, 16 ఏళ్ల బాలికలు.. పిల్లలు. మహిళలను జుట్టు పట్టుకుని లాగారు, ఆ తర్వాత వారిని దుర్భాషలాడారు," అని బెస్చాస్ట్నా ITV న్యూస్‌తో అన్నారు. . ఉక్రెయిన్‌లోని యువతులు రష్యన్‌లచే అత్యాచారానికి గురికాకుండా ఉండటానికి వారి జుట్టును కత్తిరించుకోవడం ప్రారంభించారని ఆమె తెలిపింది. రష్యా దళాలు కీవ్ శివారు ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు ఈ అత్యాచారాలు జరిగాయి. ఉక్రెయిన్ దేశంలోని మిగిలిన ప్రాంతాలలో కూడా అత్యాచారాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి.
తమ దళాలు మార్చి 30 నాటికే ఉక్రెయిన్ నుంచి వెనుదిరిగాయని రష్యా చెబుతూ ఉంది. మాక్సర్ సంస్థకు చెందిన ఉపగ్రహాలు చిత్రీకరించిన దృశ్యాలు రష్యన్ సేనల దారుణాలకు సాక్ష్యాలుగా నిలిచాయి.. బుచా నగర వీధుల్లో విసిరేసినట్టుగా ఉన్న శవాలు, ఓ చర్చి మైదానం వద్ద సామూహిక ఖననం కోసం తవ్విన గుంత మాక్సర్ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపించాయి. ఈ ఉపగ్రహాలు మార్చి 10 నుంచి వివిధ తేదీల్లో తీసిన ఫొటోలు, రష్యా సేనల దారుణాలను బయటపెడుతున్నాయి.
తాజాగా రష్యా తూర్పు ఉక్రెయిన్ ను టార్గెట్ చేసింది. అక్కడి రైల్వేస్టేషన్ పై రష్యా రాకెట్ దాడులకి పాల్పడింది. రెండు రష్యా క్షిపణులు ఈ రైల్వే స్టేషన్ ను తాకాయని 30 మందికి పైగా మరణించారని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. 100 మందికి పైగా గాయపడ్డారని వివరించింది. క్రామటోర్స్క్ రైల్వే స్టేషన్ ను సాధారణ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వినియోగిస్తున్నామని ఉక్రెయిన్ తెలిపింది. రష్యా యుద్ధ నేరగాళ్లు తమ పౌరులను ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకుంటున్నారని, భారీస్థాయిలో విధ్వంసం సృష్టించే క్లస్టర్ బాంబులను కూడా ఉపయోగిస్తున్నారని ఆరోపించింది.