ఉక్రెయిన్‌పై విరుచుకుప‌డిన‌ ర‌ష్యా.. 137 మంది మృతి

Ukraine's president says 137 dead after first day of fighting. ఉక్రెయిన్‌పై ర‌ష్యా విరుచుకుప‌డుతుంది. తమ దేశంపై రష్యా జ‌రిపిన దాడుల‌లో ఇప్పటి వరకు

By Medi Samrat  Published on  25 Feb 2022 6:51 AM GMT
ఉక్రెయిన్‌పై విరుచుకుప‌డిన‌ ర‌ష్యా.. 137 మంది మృతి

ఉక్రెయిన్‌పై ర‌ష్యా విరుచుకుప‌డుతుంది. తమ దేశంపై రష్యా జ‌రిపిన దాడుల‌లో ఇప్పటి వరకు 137 మంది పౌరులు, సైనిక సిబ్బంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున విడుదల చేసిన వీడియోలో ఆయ‌న‌ వారిని "హీరోలు" అని అభివ‌ర్ణించారు. ఈ దాడి ఘ‌ట‌న‌లో 316 మంది సైనిక‌, ఇత‌ర ప్ర‌జ‌లు గాయపడ్డారని కూడా పేర్కొన్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యా కేవలం సైనిక లక్ష్యాలపై మాత్రమే దాడి చేస్తుందని పేర్కొన్నప్పటికీ.. పౌరులు ఉంటున్న‌ ప్రదేశాలు కూడా ధ్వంసమయ్యాయని ప్ర‌ముఖ వార్తా సంస్థ‌లు నివేదిస్తున్నాయి. వారు ప్రజలను చంపుతున్నారు.. శాంతియుత నగరాలను సైనిక లక్ష్యాలుగా మారుస్తున్నారు.. ఇది తప్పు.. ఎప్పటికీ క్షమించబడదని జెలెన్స్కీ అన్నారు. ఒడెసా ప్రాంతంలోని Zmiinyi ద్వీపంలో సరిహద్దు గార్డులందరూ గురువారం చంపబడ్డారని అధ్యక్షుడు చెప్పారు. ఈ ద్వీపాన్ని రష్యన్లు స్వాధీనం చేసుకున్నారని ఉక్రెయిన్ బోర్డ‌ర్ స‌ర్వీస్ సిబ్బంది ముందు రోజు నివేదించింది.

సెంట్రల్ కైవ్‌లో శుక్రవారం తెల్లవారుజామున రెండు భారీ పేలుళ్లు వినిపించాయని వార్తా సంస్థ AFP శుక్రవారం తెల్లవారుజామున నివేదించింది. కైవ్‌లోని జ‌నావాస‌ ప్రాంతాలపై రష్యా కాల్పులు జరిపిందని.. అయితే ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు సైన్యం పేర్కొంది.


Next Story