పుతిన్‌తో ఫేస్ టు ఫేస్ మీటింగ్‌కు రెడీ: జెలెన్ స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik
పుతిన్‌తో ఫేస్ టు ఫేస్ మీటింగ్‌కు రెడీ: జెలెన్ స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక ప్రకటన చేశారు. రష్యాతో గత నెలలో నిలిచిపోయిన శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు తాము ఉన్నామని ప్రకటించారు. రష్యాతో వచ్చే వారం చర్చలు జరిపేందుకు అధికారిక ప్రతిపాదనను పంపినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ధృవీకరించారు. శనివారం రాత్రి ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. చర్చల ప్రతిపాదనను జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్డీసీ) కార్యదర్శి రుస్తెమ్ ఉమెరోవ్ రష్యా ప్రతినిధులకు అందించారని జెలెన్ స్కీ తన ప్రసంగంలో తెలిపారు. యుద్ధాన్ని ఆపేందుకు అవసరమైన అని రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో రష్యా వెనుకడుగు వేస్తోందని విమర్శించారు. రష్యా ఇలా చేయడం ఆపాలని నొక్కి ఆపాలని స్పష్టం చేశారు.
పుతిన్‌తో ముఖాముఖి సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని జెలెన్ స్కీ పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి కోసం నాయకత్వ స్థాయిలో ఒక సమావేశం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. అయితే అమెరికా ఒత్తిడితోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఈ చర్చల ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై రష్యా ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అయితే క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇటీవల మాట్లాడుతూ, శాంతి చర్చలకు మరింత ఇరు దేశాల నాయకుల మధ్య మరింత చొరవ అవసరమన్న జెలెన్ స్కీ వ్యాఖ్యలతో తాము ఏకీభవిస్తున్నామన్నారు.