ఓ వైపు శాంతి చర్చలు అంటూనే.. మరోవైపు అణ్వాయుధ హెచ్చరికలు

Ukraine agrees to talk with russia in belarus. బెలారస్‌ సరిహద్దులో రష్యాతో చర్చలు జరపడానికి ఉక్రెయిన్ ఆదివారం అంగీకరించిందని రష్యా ప్రభుత్వ మీడియా మాస్కోలోని

By అంజి  Published on  28 Feb 2022 1:59 AM GMT
ఓ వైపు శాంతి చర్చలు అంటూనే.. మరోవైపు అణ్వాయుధ హెచ్చరికలు

బెలారస్‌ సరిహద్దులో రష్యాతో చర్చలు జరపడానికి ఉక్రెయిన్ ఆదివారం అంగీకరించిందని రష్యా ప్రభుత్వ మీడియా మాస్కోలోని అధికారులు చెప్పారని తెలిపింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ కార్యాలయం బెలారస్‌ సరిహద్దులో గోమెల్‌ అనే ప్రదేశంలో ఇరుపక్షాలు కలుసుకుంటాయని, సమావేశానికి ఖచ్చితమైన సమయాన్ని ఇవ్వలేదని చెప్పారు. అయితే ఇప్పటికే చర్చల కోసం ఉక్రెయిన్‌ బృందం బయల్దేరింది. రష్యా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం రష్యాతో కలవడానికి సిద్ధంగా ఉందని జెలెన్స్‌కీ చెప్పిన కొన్ని గంటల తర్వాత బెలారస్‌లో చర్చలకు అంగీకరించడానికి ఉక్రెయిన్‌లో కదలిక వచ్చిందన్నారు.

ఇదిలా ఉంటే బెలారసియన్ నగరమైన గోమెల్‌లో ఉక్రేనియన్ అధికారులను కలవడానికి తమ ప్రతినిధి బృందం సిద్ధంగా ఉందని రష్యా పేర్కొంది. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌ దేశం ఉక్కిరి బిక్కిరి అయ్యింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రజలు తమ ఇళ్లులు వదిలి ప్రాణభయంతో పొరుగు దేశాలకు పరుగులు తీశారు. ఈ పరిస్థితుల్లో చర్చలకు సిద్ధమంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. రెండు దేశాలు శాంతి చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చిన వేళా.. అణ్వాయుధ అస్త్రాల వినియోగానికి సంసిద్ధంగా ఉండాలంటూ వాద్లిమిర్‌ పుతిన్‌ ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే రష్యాపై పాశ్చాత్య దేశాలు పలు ఆంక్షలు విధిస్తూ, ఉక్రెయిన్‌ దేశానికి మద్ధతుగా నిలుస్తున్నాయి. దీంతో పుతిన్‌ ఈ సంచలన చర్యకు పూనుకున్నారు. పుతిన్‌ వ్యాఖ్యలను నాటో తప్పు బట్టింది.

Next Story