ఈ-బేబీ.. ఆన్‌లైన్‌ వీర్యంతో జననం..!

UK woman gives birth to 'eBaby'. ప్రస్తుత పోటీ ప్రపంచంలో టెక్నాలజీ వేగవంతంగా మారింది. అందుకు తగ్గట్టుగానే నేటి మనుషులు

By అంజి  Published on  22 Sep 2021 10:53 AM GMT
ఈ-బేబీ.. ఆన్‌లైన్‌ వీర్యంతో జననం..!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో టెక్నాలజీ వేగవంతంగా మారింది. అందుకు తగ్గట్టుగానే నేటి మనుషులు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లలు పుట్టని వారికి ఫెర్టిలిటీ సెంటర్లు వరంగా మారాయి. దీనికి తోడుగా సరోగసీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు విధానాలకు డాక్టర్ల పర్యవేక్షణ ఎంతో అవసరం. అయితే.. తాజాగా ఇంగ్లండ్‌ చెందిన ఓ మహిళ మాత్రం డాక్టర్ల సలహాలు, సూచనలు ఎలాంటివి పాటించకుండా ఈ- బిడ్డకు జన్మనిచ్చింది. నార్త్ యార్క్‌షైర్‌లోని నంటోర్ప్ టీసైడ్‌కు చెందిన స్టెఫెనీ టేలర్‌ కన్న ఈ ఈ-బేబీ వైద్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నది.

స్టెఫెనీ టేలర్‌ తన భర్తతో కలిసి ఐదు సంవత్సరాల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత పలు కారణాల వల్ల స్టెఫెనీ భర్తతో విడిపోయింది. ఈ క్రమంలోనే మరో బిడ్డను కనాలని స్టెఫెనీ భావించింది. అందుకు తగ్గట్టుగానే ఇంటర్నెట్‌లో వెదుకులాట ప్రారంభించింది. ప్రైవేట్ ఫెర్టిలిటీ క్లినిక్‌లకు సంబంధించిన వివరాలను సేకరించింది. ఫెర్టిలిటీ ద్వారా బిడ్డను కనేందుకు ఖర్చు ఎక్కువ అవుతుండడంతో మొదట ఆ ప్లాన్‌ను విరమించుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్‌ ద్వారా 'జస్ట్ ఏ బేబీ' యాప్‌ గురించి తెలుసుకున్న స్టెఫెనీ టేలర్‌.. వారిని కాంటాక్ట్ చేసింది. మంచి ఆరోగ్య వంతుడి వీర్యాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసింది. అలాగే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఈబే నుంచి ఇన్‌సెమినేషన్ కిట్‌ను కొనుగోలు చేసింది.

సరిగ్గా 14 రోజుల పాటు సమాచారం ఇచ్చిపుచ్చుకున్న తర్వాత ఓ వ్యక్తి తన వీర్యాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరం మొదటి నెలలో స్టెఫెనీ టేలర్‌కు అతడి వీర్యం అందింది. ఆ తర్వాత యూట్యూబ్‌లో ఇన్‌సెమినేషన్‌ కిట్‌ ఎలా వాడాలో తెలుసుకున్న స్టెఫెనీ.. ఆ వీడియోలోని సూచనలు పాటిస్తూ విజయవంతంగా గర్భం దాల్చింది. ఈ విధంగా తాను అమ్మను కావడం చాలా సంతోషంగా ఉందని స్టెఫెనీ అన్నారు. పుట్టిన బిడ్డకు ఈడెన్‌ అని పేరు నామకరణం చేసింది. పాప పుట్టిన విషయాన్ని వీర్యాన్ని అందించిన వ్యక్తితో పంచుకున్నది. ఇది వైద్య చరిత్రలో నిలిచిపోయే నిజమైన ఈ-బేబీ అని స్టెఫెనీ టేలర్ అంది.


Next Story