భారతీయులకు ఇకపై 15 రోజుల్లో వీసా
UK visa for Indians. భారతీయులకు యూకే హైకమిషన్ 15 రోజుల్లో వీసా కల్పిస్తామని ప్రకటన చేసింది.
By Medi Samrat Published on 19 Oct 2022 5:15 PM ISTభారతీయులకు యూకే హైకమిషన్ 15 రోజుల్లో వీసా కల్పిస్తామని ప్రకటన చేసింది. వీసా దరఖాస్తుల నిర్వహణకు సంబంధించిన ప్రమాణాలపై బ్రిటీష్ హైకమిషనర్ వేగంగా పనిచేస్తోందని.. దీంతో ప్రజలు త్వరగా వీసాలు పొందొచ్చని బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తెలిపారు. అలెక్స్ ఎల్లిస్ ప్రకారం బ్రిటిష్ హైకమిషన్ 15 రోజులలోపు భారతదేశం నుండి UKకి వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేస్తామని తెలిపారు. విజిటర్ వీసాల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడంపై దృష్టి సారించి.. నైపుణ్యం కలిగిన వర్కర్ వీసాలు మరింత వేగంగా ప్రాసెస్ చేస్తామని పేర్కొన్నారు.
గత ఏడాదితో పోలిస్తే భారతీయ విద్యార్థుల సంఖ్య 89శాతం పెరిగిందన్నారు. స్కిల్డ్ వర్కర్ వీసాల ప్రాసెసింగ్ వేగంగా జరిగిందని..విజిటర్ వీసాల సమయానికి తగ్గించడమే మా ముందున్న లక్ష్యమని అన్నారు. కరోనా, ఉక్రెయిన్ పై రష్యా దాడి కారణంగా యూకే 15 రోజుల వీసా ప్రమాణాన్ని రద్దు చేసింది. ఇప్పుడు దాన్ని పునః ప్రారంభించింది. జూన్ నాటికి సుమారు 118000మంది భారతీయ విద్యార్థులు వీసాలు పొందారు. ఇది గతేడాది కంటే 89 శాతం పెరిగింది. 2022 జూన్ నాటికి 258000 కంటే ఎక్కువ మంది భారతీయులు టూరిజం వీసాలు పొందారు.