లోదుస్తుల తోనే ప‌రారైన ఖైదీ..!

UK man escapes prison wearing just underwear and socks. యూకేలో 32 ఏళ్ల ఖైదీ ఓ విచిత్రమైన ప‌రిస్థితుల‌లో జైలు నుంచి ప‌రార‌య్యాడు.

By Medi Samrat  Published on  27 March 2022 11:39 AM GMT
లోదుస్తుల తోనే ప‌రారైన ఖైదీ..!

యూకేలో 32 ఏళ్ల ఖైదీ ఓ విచిత్రమైన ప‌రిస్థితుల‌లో జైలు నుంచి ప‌రార‌య్యాడు. కేవ‌లం లోదుస్తులు, సాక్స్‌లను ధరించి కస్టడీ నుండి తప్పించుకున్నాడు. 32 ఏళ్ల‌ కైల్ డారెన్ ఎగ్లింగ్టన్.. శనివారం ఉదయం 11.13 గంటలకు భద్రతా అధికారులపై దాడి చేసి.. కోర్టు ఖైదీ రవాణా వ్యాన్ నుండి పరారీ అయ్యాడని డోర్సెట్ పోలీసులు తెలిపారు. ఈ ఫన్నీ సంఘటనకు సంబంధించిన వార్తలు ప్ర‌స్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

అతను పోలీసుల‌తో కోర్టుకు బయలుదేరినప్పుడు కేవలం లోదుస్తులు(డ్రాయ‌ర్‌), సాక్స్ మాత్రమే ధరించాడని తెలిపారు. ఎగ్లింగ్టన్‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా శోధిస్తున్నారు. సమాచారం కోసం ప్రజలకు విజ్ఞప్తి కూడా చేశారు. ఎగ్లింగ్టన్ తెల్లగా.. 5 అడుగుల 11అంగుళాల పొడవు, ముదురు గోధుమ రంగు జుట్టు, గడ్డంతో ఉంటాడ‌ని అత‌ని పోలిక‌లు తెలియ‌జేస్తూ ఓ ఫోటోను కూడా విడుద‌ల చేశారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో బోర్న్‌మౌత్‌లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి దోపిడీ నేరానికి పాల్పడినట్లు అభియోగాలు మోపబడటంలో ఎగ్లింగ్టన్ రిమాండ్‌లో ఉన్నాడు. ఈ నేఫ‌థ్యంలోనే పోలీసులు మార్చి 25న పూలే మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నేషనల్ పోలీస్ ఎయిర్ సర్వీస్ హెలికాప్టర్, బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసుల సహాయంతో.. ఆ ప్రాంతాన్ని శోధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. "కేవలం అతను లోదుస్తులు, సాక్స్‌లలో" ఉన్న వ్యక్తిని చూసిన లేదా.. ఆ వివ‌రాల‌తో సరిపోలిన వ్యక్తి క‌నిపించినా పోలీసులకు తెలిపాల‌ని అధికారులు అక్క‌డి ప్ర‌జ‌ల‌ను కోరారు.

Next Story