సూప్ లో ఏదో కదులుతోందని గమనించాడు.. తీరా చూస్తే

సామ్ హేవార్డ్ అనే వ్యక్తి చైనీస్ రెస్టారెంట్ నుండి సూప్ ఆర్డర్ ఇచ్చాడు.

By Medi Samrat  Published on  5 Sep 2023 4:00 PM GMT
సూప్ లో ఏదో కదులుతోందని గమనించాడు.. తీరా చూస్తే

సామ్ హేవార్డ్ అనే వ్యక్తి చైనీస్ రెస్టారెంట్ నుండి సూప్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆ సూప్ లో ఉన్నది చూసి హేవార్డ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సామ్ హేవార్డ్ సూప్ ను తినాలని అనుకుంటూ ఉండగా.. అందులో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. వెంటనే తన మొబైల్ ఫోన్ ను తీసి రికార్డు చేయడం మొదలుపెట్టాడు. ఆ సూప్ ను నిశితంగా గమనిస్తే అందులో ఓ ఏలిక ఉంది. అది ఇంకా కదులుతూనే ఉండడం వీడియోలో రికార్డు అయింది.

యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన సామ్ హేవార్డ్.. చైనీస్ రెస్టరెంట్ నుండి సూప్‌ ను ఆర్డర్ ఇచ్చాడు. తీరా ఆరగిద్దామని అనుకుంటే.. అందులో ఎలుక కనిపించింది. దీంతో అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. కెంట్‌కు చెందిన వ్యక్తి తన మష్రూమ్ నూడిల్ సూప్‌లో ఎలుక కనిపించిందని ఇండిపెండెంట్ సంస్థ నివేదించింది. అతను మొదట అందులో ఉన్నది పెద్ద పుట్టగొడుగుగా భావించాడు, కానీ నిశితంగా పరిశీలించినప్పుడు అదేదో తోకతో ఉన్న జీవి అని అతను గ్రహించాడు. ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన హేవార్డ్ రికార్డు చేయడం ప్రారంభించాడు. వెంటనే ఆహారాన్ని ఆర్డర్ చేసిన రెస్టారెంట్‌ను సంప్రదించాడు. అయితే ఇందులో తమ పొరపాటు ఏమీ లేదని.. ఎలుక రావడానికి తమకు ఎటువంటి సంబంధం లేదని సదరు రెస్టారెంట్ సిబ్బంది తెలిపింది. రెస్టారెంట్ ఈ సంఘటనకు ఎటువంటి బాధ్యత వహించలేదని తెలిపింది. అలాగే రీఫండ్ ఇవ్వడానికి నిరాకరించింది. రెండు దశాబ్దాలుగా రెస్టారెంట్‌కు నమ్మకమైన కస్టమర్‌గా ఉన్న హేవార్డ్, వారి ప్రతిస్పందనపై నిరాశను వ్యక్తం చేశాడు. కనీసం తనకు సారీ చెబుతారని ఆశించానని హేవార్డ్ చెప్పుకొచ్చాడు.

Next Story