జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్ కు బ్రిటన్ ఆమోదం

UK approves Janssen single-dose Covid vaccine for use. కరోనాకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్

By జ్యోత్స్న  Published on  28 May 2021 2:47 PM GMT
జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్ కు బ్రిటన్ ఆమోదం

కరోనాకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వాక్సిన్ కు బ్రిటన్ ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని బ్రిటన్ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ప్రకటించింది. ఇప్పటి వరకు బ్రిటన్‌ ఫైజర్‌, ఆస్ట్రాజెనికా, మోడర్నా వ్యాక్సిన్లకు అనుమతినివ్వగా ఇది నాల్గవది. భయంకరమైన వైరస్ నుంచి ప్రజలను రక్షించడంలో సహాయపడేందుకు నాలుగు సురక్షితమైన, సమర్థమైన వ్యాక్సిన్లను నాలుగు వ్యాక్సిన్లను ఆమోదించినట్టు ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్‌కాక్ తెలిపారు.

ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ మున్ముందు మరింత కీలకం కానుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ నేపథ్యంలో ఎంతోమంది తమ వ్యాక్సిన్ల కోసం ముందుకు వస్తున్నారని హన్‌కాక్‌ తెలిపారు. 20 మిలియన్‌ డోసుల జాన్సన్‌ వ్యాక్సిన్లను బ్రిటన్‌ ఆర్డర్‌ చేసింది. కాగా, అమెరికాలో పరీక్షలు చేపట్టిన సమయంలో 72 శాతం ప్రభావంతంగా పనిచేస్తున్నట్టు తేలింది. అయితే రక్తం గడ్డకట్టడంతో పాటు ప్లేట్లేట్స్‌ పడిపోవడం వంటివి కేసులు వెలుగుచూడటంతో. ప్రొడక్ష్ట్‌ సమాచారాన్ని జత చేయాలని యూరోపియన్‌ మెడిసన్స్‌ ఏజెన్సీ పేర్కొంది. బ్రిటన్ ఇప్పటి వరకు తన దేశంలో 62 మిలియన్ల వాక్సిన్ షాట్స్‌ను పంపిణీ చేసింది. ఇందులో ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లు ఉన్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాను రిఫ్రిజిరేటర్లలో 2 నుండి 8 డిగ్రీల సెల్సియస్ అంటే 35.6 నుండి 46.4 డిగ్రీల ఫారెన్‌హీట్ లో నిల్వ చేయవచ్చు.

జూలై చివరి నాటికి బ్రిటన్ లోని ప్రజలందరికి కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించే లక్ష్యాన్ని పెట్టుకుంది అక్కడి ప్రభుత్వం. బుధవారం నాటికి UK లో 62.6 మిలియన్లకు పైగా వ్యాక్సిన్లు ఇవ్వబడ్డాయి, సుమారు 73% మంది పెద్దలు తమ ఫస్ట్ డోస్ పూర్తి చేసుకున్నారు. దేశంలోని దాదాపు సగం జనాభా రెండవ మోతాదు కూడా తీసుకున్నట్లుగా అధికారిక సమాచారం.


Next Story