రెండు హౌతీ మిసైల్స్ ను అడ్డుకున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

UAE Destroys 2 Houthi Missiles. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సోమవారం నాడు గల్ఫ్ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని

By Medi Samrat  Published on  24 Jan 2022 10:47 AM GMT
రెండు హౌతీ మిసైల్స్ ను అడ్డుకున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సోమవారం నాడు గల్ఫ్ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని వస్తున్న రెండు హౌతీ బాలిస్టిక్ క్షిపణులను ఎటువంటి ప్రాణనష్టం లేకుండా ధ్వంసం చేసిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరు సంవత్సరాలకు పైగా, హౌతీలు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలతో పోరాడుతున్నారు. సౌదీ అరేబియాపై పదేపదే క్రాస్-బోర్డర్ క్షిపణిలు, డ్రోన్ దాడులను చేస్తున్నారు. జనవరి 17న కూడా UAEపై డ్రోన్ లతో దాడి చేసిన సంగతి తెలిసిందే..! "అబుదాబి చుట్టూ ఉన్న ప్రత్యేక ప్రాంతాలలో బాలిస్టిక్ క్షిపణుల అవశేషాలు పడిపోయాయి" అని యూఏఈ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని దాడులకు వ్యతిరేకంగా అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

కొద్దిరోజుల కిందట రాజధాని అబుదాబిలోని ఇంధన డిపోపై డ్రోన్స్ దాడి చేయడంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సౌదీ అరేబియా, యూఏఈకి వ్యతిరేకంగా "విస్తృత సైనిక ఆపరేషన్" వివరాలను గంటల్లోనే గ్రూప్ ప్రకటిస్తుందని హౌతీ నడుపుతున్న అల్ మసీరా టెలివిజన్ ఛానల్ చెప్పుకొచ్చింది. ఆదివారం నాడు సౌదీకి దక్షిణాన ఒక హౌతీ బాలిస్టిక్ క్షిపణి పడిపోయిందని, ఇద్దరు విదేశీయులు గాయపడ్డారని, పారిశ్రామిక ప్రాంతంలోని వర్క్‌షాప్‌లు, వాహనాలను ధ్వంసం చేశారని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌లో హౌతీ లక్ష్యాలపై వైమానిక దాడులను వేగవంతం చేశాయి.


Next Story