ఉద్యోగుల పనిదినాలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులకు నాలుగున్నర రోజులే పనిదినాలు ఉంటాయని ప్రకటించింది. ఇన్ని రోజులో యూఏఈలో ఐదు రోజుల పనిదినాలు ఉండేవి. దాని ప్రకారం శని, ఆదివారాలు సెలవు. ఇక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకే విధులు ఉంటాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వారాంతపు సెలవులు మొదలు అవుతాయి. ఇకపై అక్కడి ఉద్యోగులకు వారానికి రెండున్నర రోజులు సెలవులుగా లభిస్తాయి. ఈ నూతన విధానం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని యూఏఈ పాలకవర్గం తెలిపింది. ఈ నిర్ణయం తో ఇక నుంచి దుబాయ్, అబుదాబీ, షార్జా వంటి నగరాల్లో సెలవు దినాలు మారనున్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన అధికారిక పని వారాన్ని నాలుగున్నర రోజులకు తగ్గించి, పోటీతత్వాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. జనవరి 1 నుండి ప్రభుత్వ సంస్థలకు "జాతీయ పని వారం" తప్పనిసరి అని, ముస్లిం ప్రార్థనల కోసం శుక్రవారం పూర్తి రోజు సెలవు దినం అనే ప్రాంతీయ నియమాన్ని తీసుకుని వచ్చారు. కొత్త టైమ్‌టేబుల్ ప్రకారం, పబ్లిక్ సెక్టార్ వారాంతం శుక్రవారం మధ్యాహ్నానికి ప్రారంభమై ఆదివారంతో ముగుస్తుంది. మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలు ఏడాది పొడవునా మధ్యాహ్నం 1:15 తర్వాత నిర్వహించబడతాయి. ప్రపంచంలో ఐదు రోజుల వారం కంటే తక్కువ జాతీయ పని వారాన్ని ప్రవేశపెట్టిన మొదటి దేశం UAE అని ఆ దేశ అధికారులు స్పష్టం చేశారు.