ట్విట్టర్ డీల్ హోల్డ్ లో ఉందంటున్న ఎలాన్ మస్క్

Twitter Deal Temporarily On Hold. ట్విట్టర్‌ డీల్‌‌ ప్రపంచం మొత్తాన్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  13 May 2022 11:34 AM GMT
ట్విట్టర్ డీల్ హోల్డ్ లో ఉందంటున్న ఎలాన్ మస్క్

ట్విట్టర్‌ డీల్‌‌ ప్రపంచం మొత్తాన్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే..! ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ కామెడీగా ట్విట్టర్ ను కొనేశారని తేలిన సంగతి ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. అయితే ట్విట్టర్‌ డీల్‌ తాత్కాలికంగా ఆపేసినట్టు ఎలన్‌ మస్క్‌ ప్రకటించారు. 44 బిలియర్‌ డాలర్లకు ట్విట్టర్‌ ను కొనుగోలు చేసేందుకు మస్క్‌ డీల్‌ చేసుకున్నారు. స్పామ్‌ , ఫేక్‌ ఖాతాల వివరాలు తమకు తెలియాలని కోరాడు. అలాంటి ఖాతాలు ఐదు శాతం లోపలే ఉన్నట్టు ట్విట్టర్‌ యాజమాన్యం వెల్లడించింది. ట్విట్టర్‌లో తొలుత 9.2% వాటా కొనుగోలు చేసిన మస్క్‌ తర్వాత సంస్థ మొత్తాన్నీ కొనేసి సంగతి తెలిసిందే. దాదాపు 44 బిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదిరింది. ఒక్కో షేరు 54.20 డాలర్ల చొప్పున మొత్తం 46.5 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమని మస్క్‌ ప్రకటించాడు.

ఈ డీల్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడిందని మస్క్ ట్వీట్ చేశాడు. స్పామ్, నకిలీ ఖాతాలను పరిగణలోకి తీసుకుంటే వాస్తవాని కన్నా 5 శాతం కంటే తక్కువ యూజర్లను సూచిస్తున్నాయని, ట్విట్టర్ యూజర్ల లెక్కకు మద్దతునిచ్చే వివరాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. అందుకే స్పామ్ బాట్స్‌ని తొలగించడమే తన ప్రాధాన్యతల్లో ఒకటని అన్నారు. ఎలాన్ మస్క్ ట్వీట్‌తో ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో ట్విట్టర్ షేర్లు 20 శాతం పతనం అయ్యాయి. దీనిపై ట్విట్టర్ స్పందించాల్సి ఉంది. ఎలాన్ మస్క్ మొదట ట్విట్టర్‌లో 9 శాతం వాటాలు కొన్నట్టు ఏప్రిల్ 4న ప్రకటించారు. ట్విట్టర్‌లో 9.2 శాతం వాటా సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను సొంతం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఈ డీల్ హోల్డ్‌లో ఉన్నట్టు ప్రకటించడం సంచలనమైంది.










Next Story