సీరియళ్లలో రొమాటింక్‌ సీన్లకు చెక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

TV channels stop airing hugging scenes drama.కాలం మారుతున్న సీరియళ్లలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పటి సీరియళ్లకు.. ఇప్పటికి సీరియళ్లకు

By అంజి  Published on  23 Oct 2021 9:38 AM GMT
సీరియళ్లలో రొమాటింక్‌ సీన్లకు చెక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

కాలం మారుతున్న సీరియళ్లలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పటి సీరియళ్లకు.. ఇప్పటికి సీరియళ్లకు మధ్య చాలా తేడా ఉంది. ఇప్పటికే సినిమాల్లో మితిమీరిన శృంగార సీన్లు ఉండటం వల్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పడది సీరియళ్లకు కూడా పాకింది. సీరియల్స్‌లో కూడా రోమాంటిక్‌ సన్నివేశాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటికి చెక్‌ పెట్టేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీవీల్లో ప్రసారం అయ్యే సీరియళ్లలో పడకగది సన్నివేశాలు, రోమాన్స్‌, కౌగిలించుకోవడం ప్రసారం చేయకూడదని పాకిస్తాన్‌ ఎలక్ట్రానికి మీడియా రెగ్యూలేటరి అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. సీరియల్స్‌లో రొమాంటిక్‌ సీన్లు బాగా పెరిగిపోయాయని తమకు ఫిర్యాదులు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పెమ్రా పేర్కొంది. సీరియళ్లలో వచ్చే ఇలాంటి సీన్లు పాకిస్తాన్‌ సమాజానికి పూర్తి వ్యతిరేకమని ఉత్తర్వుల్లో వివరించింది.

అసభ్యకరంగా దుస్తులు ధరించడం, భార్యభర్తల మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్లు, పడకగది సీన్లు, వివాహేతర సంబంధాలు, కౌగిలించుకోవడం, లాలించుకోవడం లాంటివి పాకిస్తాన్‌ సంస్కృతిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కిందకే వస్తుందని పెమ్రా పేర్కొంది. సీరియళ్లను ప్రసారం చేసే చానళ్లు ముందుగా అసభ్యత లేదని ఒకటికి రెండు సార్లు పరిశీలించుకున్న తర్వాత టెలికాస్ట్‌ చేయాలని తెలిపింది. పెమ్రా తాజా ఆదేశాలపై హ్యూమన్‌ రైట్స్‌ ప్రొఫెషనల్‌ రీమా ఓమర్‌ స్పందించారు. ''పెమ్రా నిర్ణయం సరైంది, పెళ్లైన జంటల మధ్య సాన్నిహిత్యం, ఆప్యాయత పాకిస్తాన్‌ సమాజంలో ఉండదు. మా 'సంస్కృతి' నియంత్రణ, దుర్వినియోగం, హింస మాత్రమే. ఇటువంటి పరాయి విలువలు విధించకుండా మనమందరం మన సంస్కృతిని కాపాడుకోవాలి అంటూ రీమా ఓమర్‌ ట్వీట్‌ చేశారు.


Next Story